జాతీయ వార్తలు

ఉరీతో మాకు సంబంధం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, అక్టోబర్ 5: కాశ్మీర్‌లోని ఉరీ సైనిక శిబిరంపై జరిగిన దాడులతో తమకు ఎలాంటి సంబంధం లేదని పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తెగేసి చెప్పారు. అసలు ఎలాంటి నిర్థారణ లేకుండా దాడి జరిగిన కొన్ని గంటల్లోనే భారత్ తమపై ఆరోపణలు చేయడం మొదలు పెట్టిందన్నారు. కాశ్మీర్ అంశంపై ప్రత్యేకంగా చర్చించడానికి బుధవారం జరిగిన పార్లమెంట్ సమావేశంలో మాట్లాడిన నవాజ్ భారత్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. హిజ్‌బుల్ మిలిటెంట్ బూర్హన్ వనీని త్యాగాన్ని కీర్తించిన నవాజ్ అతడి ప్రాణ త్యాగం వల్లే కాశ్మీర్ ఉద్యమం నిర్ణయాత్మక దశకు చేరుకుందన్నారు. చర్చల ప్రక్రియకు భంగం కలిగిస్తున్నది భారత దేశమేనని, ఐరాస తీర్మానాల ప్రకారం కాశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి ప్రపంచ దేశాలు జోక్యం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ‘నేను ఐరాస సదస్సులో మాట్లాడబోతున్న తరుణంలోనే ఉరీపై దాడి జరిగింది. ఎలాంటి దర్యాప్తు లేకుండానే ఆ దాడి పాకిస్తాన్ పనేనని భారత్ ఓ నిర్థారణకు వచ్చేసింది’అని నవాజ్ అన్నారు. గత నెల్లో భారత దళాలు జరిపిన ఏకపక్ష కాల్పుల్లో తమ సైనికులు ఇద్దరు మరణించారని చెప్పారు. ఆ దాడిని తగిన విధంగానే తిప్పికొట్టామని, తమ దేశంపై దురాక్రమణకు ఎవరు పాల్పడినా గట్టిగా ఎదుర్కొనేందుకు సైనిక దళాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయన్నారు. ఉరీపై భారత్ చేసిన ప్రకటనపై ఎన్నో అనుమానాలున్నాయని, దీనిపై అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తు జరగాలన్నారు. తాము యుద్ధానికి వ్యతిరేకమని, కాశ్మీర్ సహా అన్ని సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్నదే తమ అభిమతమని చెప్పారు. భారత్‌ను చర్చలకు రప్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయిందన్నారు. భారత ధోరణి వల్ల మొత్తం దక్షిణాసియా ప్రాంతమే ప్రమాదంలో పడిందని వ్యాఖ్యానించారు.
ఇది ఉగ్రవాదానికి వత్తాసే
* నవాజ్‌పై భారత్ నిప్పులు
న్యూఢిల్లీ, అక్టోబర్ 5: హిజ్‌బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది బూర్హన్ వనీని కాశ్మీర్ బిడ్డగా అభివర్ణిస్తూ పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ చేసిన ప్రకటనపై భారత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. భారత దళాల కాల్పుల్లో మరణించిన ఉగ్రవాదిని కీర్తించడమంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నామని పాక్ అంగీకరించడమేనని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.