జాతీయ వార్తలు

25సార్లు పాక్ కాల్పుల ఉల్లంఘన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్ము, అక్టోబర్ 7: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో అనూహ్యంగా దాడిచేసి ఉగ్రవాద శిబిరాలను భారత సైన్యం ధ్వంసం చేసిన అనంతరం పాకిస్తాన్ అనుక్షణం కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడుతోంది. సెప్టెంబర్ 29న భారత్ జరిపిన లక్షిత దాడుల తర్వాత ఇప్పటివరకు 25సార్లు కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడినట్లు సీనియర్ సైనిక అధికారి ఒకరు వెల్లడించారు. జమ్మూకాశ్మీర్ నియంత్రణ రేఖ వెంబడి చోటుచేసుకుంటున్న ఈ ఉల్లంఘనల్లో పాక్ సైనికులు మోర్టార్లను, తేలికపాటి ఆయుధాలతో కాల్పులకు తెగబడుతున్నారు. ముఖ్యంగా ఈ నెల 3, 4, 5 తేదీల్లో భారీ స్థాయిలోనే కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఈ నెల 5వ తేదీన ఒక్కరోజే మూడుసార్లు కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడింది. మోర్టార్లతో దాడికి దిగిన పాక్ సైన్యం భారత సైనిక శిబిరాలను, నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంది. పూంఛ్, రాజౌరి జిల్లాలోని మూడు సెక్టార్లలో పాక్ దళాలు దాడికి పాల్పడటంతో ముగ్గురు జవాన్లు స్వల్ప గాయాలయ్యాయి. అలాగే భారత్ జరిపిన ఎదురు దాడుల్లో తొమ్మిదిమంది పాక్ సైనికులు గాయపడ్డారు. 4వ తేదీన జమ్మూ, పూంఛ్, రాజౌరి జిల్లాల్లో ఐదుసార్లు పాక్ సైన్యం ఉల్లంఘనకు పాల్పడింది.