జాతీయ వార్తలు

భారత సైన్యంతో అన్ని కాంటాక్ట్‌లు కొనసాగుతున్నాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, అక్టోబర్ 7: హాట్‌లైన్ సహా భారత సైన్యంతో అన్ని కమ్యూనికేషన్ మార్గాలు తెరిచే ఉన్నాయని పాకిస్తాన్ సైన్యం శుక్రవారం స్పష్టం చేసింది. అయితే భారత సైన్యం ఉద్రిక్తతలను పెంచుతోందని ఆరోపించింది. ‘్భరతీయ సైన్యం కాల్పులు జరపడం ద్వారా నియంత్రణ రేఖను ఉల్లంఘించింది. ఆ తర్వాత కొద్ది గంటలకు లక్షిత దాడులు జరిపామని తప్పుడు ప్రకటన చేసింది. అయితే మేము అక్కడ అన్ని వాస్తవ పరిస్థితులను చెక్ చేశాము. సర్జికల్ దాడులకు సంబంధించి భారత సైన్యం చేసిన ప్రకటనలో ఎంతమాత్రం నిజం లేదని మాకు స్పష్టమైంది’ అని పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ప్రజాసంబంధాల విభాగం డైరెక్టర్ జనరల్ లెఫ్టెనెంట్ జనరల్ అసీమ్ బాజ్వా చెప్పారు. నియంత్రణ రేఖ వెంబడి మరింత తీవ్రస్థాయి కాల్పులుకొనసాగడం మాత్రమే తమకు కనిపించిందని ఆయన చెప్తూ, కాల్పులు ఎక్కువైనప్పుడు ఉద్రిక్తత పెరగడం సహజమని అన్నారు. అలాగే భారత్‌వైపునుంచి రెచ్చగొట్టే ప్రకటనలు పెరిగినప్పుడు సైతం వాతావరణం వేడెక్కుతుందని చైనా అధికార ‘జిన్హువా’ వార్తాసంస్థకు గురువారం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బాజ్వా చెప్పారు. గత వారం రోజులుగా భారత్ జరుపుతున్న కాల్పుల్లో కనీసం ఇద్దరు పాక్ సైనికులు మృతి చెందారని, మరో తొమ్మిది మంది జవాన్లు గాయపడ్డారని ఆయన చెప్పారు. అయితే ప్రస్తుత ఉద్రిక్తతను చర్చల ద్వారా పరిష్కరించుకోవడం ముఖ్యమని ఆయన అంగీకరించడం గమనార్హం. భారత్, పాకిస్తాన్ సైన్యాల మధ్య సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయని చెప్పిన ఆయన నియంత్రణ రేఖ వద్ద కాల్పులు ప్రారంభమైన తర్వాత రెండు దేశాల మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్(డిజిఎంఓ)లు ఫోన్‌లో మాట్లాడుకున్నారని ఆయన చెప్పారు. ‘హాట్‌లైన్ సహా రెండు సైన్యాల మధ్య అన్ని కమ్యూనికేషన్ చానల్స్ తెరిచే ఉన్నాయి’ అని ఆయన చెప్పారు.
భారత్, పాక్‌లలోని ఐక్యరాజ్య సమితికి చెందిన మిలిటరీ పర్యవేక్షక బృందాలు కూడా పరిస్థితిని గమనిస్తూ, తమ ప్రధాన కార్యాలయానికి ఎప్పటికప్పుడు నివేదిస్తూనే ఉన్నాయని కూడా ఆయన చెప్పారు.