జాతీయ వార్తలు

లౌకిక దేశంలో మూడు తలాఖ్‌లకు చోటు లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 7: ముస్లిం కుటుంబ వ్యవస్థలో కొనసాగుతున్న మూడు తలాఖ్‌ల సంప్రదాయానికి లౌకిక దేశమైన భారత్‌లో చోటు లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు స్పష్టం చేసింది. ముస్లిం కుటుంబాల్లో వివాహ వ్యవస్థ విచ్ఛిన్నానికి ఇది కారణం అవుతోందని తెలిపింది. ముస్లిం చట్టాల్లో కుటుంబపరమైన అంశాలకు సంబంధించి ఏమేరకు జోక్యం చేసుకోవాలన్న అంశంపై పరిశీలన జరుపుతున్న సుప్రీంకోర్టు, ‘ట్రిపుల్ తలాఖ్’పై ప్రభుత్వ విధానాన్ని స్పష్టం చేయాలన్న సూచన మేరకు కేంద్రం తన అభిప్రాయాన్ని వెల్లడించింది. . ముస్లిం చట్టాల్లో జోక్యం చేసుకోవడం వల్ల ముస్లింల ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుందా లేదా అనే విషయం విస్తృతంగా చర్చించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. అయితే లింగ సమానత్వం, మహిళల గౌరవానికి భంగం కలగడం వంటి అంశాలలో రాజీ పడేది లేదని కేంద్రం వెల్లడించింది. ఇస్లామిక్ దేశాలలో కూడా ఈ అంశాలపై సంస్కరణలు అమలు అవుతున్నాయని ‘తలాఖ్’ వంటి ఆచారాలను ముస్లిం మతంలోని అంతర్గత వ్యవహారంగా పరిగణించలేమని న్యాయమూర్తులకు ప్రభుత్వం వివరించింది. కాగా, ముస్లిం పర్సనల్ లా బోర్డులో సంస్కరణలు తీసుకురావాలని, ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాల వల్ల మహిళలు వివక్షకు గురవుతున్నారని ముస్లిం మహిళా హక్కుల కార్యకర్తలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించే ముస్లిం మహిళా బోర్డు ఓ పిటిషన్‌ను సుప్రీం కోర్టులో దాఖలు చేసింది. బహుభార్యత్వానికి, బాల్య వివాహాలకు, ఏకపక్షంగా విడాకులు పొందేందుకు ఈ విధానాలు కారణమవుతున్నాయని, తద్వారా ముస్లిం మహిళలు వివక్షకు గురికావలసి వస్తోందని వారు ఆరోపిస్తున్నారు. మూడుసార్లు తలాఖ్ చెప్పిన మరుక్షణంలో పురుషులు విడాకులు పొందుతున్నారని, అంతేకాకుండా ఫేస్‌బుక్, స్కైప్, ఎస్‌ఎంఎస్ ద్వారా కూడా ట్రిపుల్ తలాఖ్ చెప్పడం ఖురాన్‌కు కూడా వ్యతిరేకమని, రాజ్యాంగ విరుద్ధమని, లింగ సమానత్వం అనే ప్రాథమిక హక్కును ఉల్లంఘించడమే అవుతుందని వారు వాదించారు. అంతకుముందు, ముస్లిం కుటుంబ వ్యవస్థలో సంస్కరణలు తీసుకువచ్చే విషయంలోగానీ, మతపరమైన స్వేచ్ఛకు సంబంధించిన అంశాల్లో గానీ, అలాగే సంస్కరణల పేరుతో ముస్లిం పర్సనల్ లా’ను తిరగరాసే విషయంలో గానీ కోర్టు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు స్పష్టం చేసింది. మరోవైపు ట్రిపుల్ తలాఖ్‌ను రద్దు చేయాలా వద్దా? పౌరులకు ఉమ్మడి పౌరస్మృతి ఐచ్ఛికం చేయాలా లేక ఒకేరకంగా అమలు చేయాలా అన్న అంశాలపై కేంద్ర న్యాయ శాఖ ప్యానల్ ప్రజాభిప్రాయాల్ని కోరింది. వీటికి సంబంధించి మొత్తం 16 ప్రశ్నలకు ప్రజల నుంచి సమాధానాల్ని కోరింది. కాగా మన దేశం కంటే ఇస్లామిక్ దేశాలలో ముస్లిం మహిళలు ఎక్కువ సమానత్వం, హక్కులను అనుభవిస్తున్నారని కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి మేనకాగాంధీ అన్నారు.