జాతీయ వార్తలు

అరచేతిలో స్వర్గం చూపుతున్న కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 7: తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కెసిఆర్ అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. ప్రజల సంక్షేమాన్ని విస్మరిస్తూ కేవలం హంగు ఆర్భాటాలకు ముఖ్యమంత్రి పోతున్నారని మండిపడ్డారు. శుక్రవారం ఇక్కడి తెలంగాణ భవన్‌లో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కెసిఆర్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయినా తెలంగాణలో చేసిన అభివృద్ధి శూన్యం అని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందన్నారు. అభివృద్ధి చేయడం లేదన్న విమర్శల నుంచి ప్రజల దృష్టిని మళ్లిండానికే ప్రభుత్వం బతుకమ్మ, బోనాలు, పుష్కరాల పేరిట కోట్లల్లో ప్రజల సొమ్మును ఖర్చు చేస్తోందని అన్నారు.