జాతీయ వార్తలు

సంజయ్ నిరుపమ్‌కు ఫోన్లో బెదిరింపులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 7: భారత సైన్యం జరిపిన లక్షిత దాడులపై సం దేహం వ్యక్తం చేస్తూ వివాదాన్ని రాజేసిన ముంబయి కాంగ్రెస్ అధ్యక్షుడు సంజయ్ నిరుపమ్.. తనకు గ్యాంగ్‌స్టర్ రవి పూజారి నుంచి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చిందని శుక్రవారం ఇ క్కడ విలేఖరుల సమావేశంలో చె ప్పారు. లక్షిత దాడులపై తాను చేసి న వ్యాఖ్యలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని రవి పూజారి హెచ్చరించినట్టు సంజయ్ నిరుపమ్ పే ర్కొన్నారు. అక్టోబర్ 5వ తేదీన ఉ దయం 11.15 గంటలకు తన ఇంట్లో గల ల్యాండ్‌లైన్ ఫోన్‌కు రవి పూజా రి ఫోన్ చేసి బెదిరించాడని వివరించారు. ఈ ఫోన్ కాల్ విదేశం నుంచి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
ఈ బెదిరింపులపై సంజయ్ నిరుపమ్ ఇదివరకే వెర్సోవా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సైనిక చర్యపై తాను చేసిన వ్యాఖ్యలకు బహిరంగంగా క్షమాపణ చెప్పకుంటే తాను, తన కుటుంబ సభ్యులు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని రవి పూజారి హెచ్చరించినట్టు నిరుపమ్ వివరించారు. ఈ బెదిరింపులపై తాను వెర్సోవా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని ఆయన చెప్పారు. అయితే ఇప్పటి వరకు ముంబయి పోలీసు కమిషనర్ కాని, ఇతర అధికారులు కాని ఎవరూ దీనికి సంబంధించి సమాచారం ఇవ్వాలని తనను అడగలేదని ఆయన వెల్లడించారు. తనకు వచ్చిన బెదిరింపు కాల్‌కు బాధ్యత బిజెపి ప్రభుత్వానిదేనని ఆయన ఆరోపించారు. ‘ప్రతిపక్ష నాయకులను గూండాలతో బెదిరిస్తారా? నేను ప్రజాసమూహం నుంచి వచ్చిన నాయకుడిని. నన్ను ఎందుకు బెదిరిస్తారు?’ అని సంజయ్ నిరుపమ్ నిలదీశారు.