జాతీయ వార్తలు

మరింత పటిష్ఠంగా ఆర్‌టిఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 7: సమాచార హక్కు చట్టం పటిష్టంగా అమలుచేయడానికి, పారదర్శకతతో పనిచేయడానికి సామాజిక కార్యక్తలు, పాత్రికేయులు సలహాలు సూచనలు ఇవ్వాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వశాఖల్లో ఆర్‌టిఐని అమలుచేయాలన్న కృత నిశ్చయంతో ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. ఆర్‌టిఐను మరింత సమర్ధవంతంగా అమలుచేయాలన్న ఉద్దేశంతో మీడియా, స్వచ్ఛంద సంస్థలు, పౌర సంస్థలను భాగస్వాములను చేస్తామన్నారు. వివిధ కేంద్ర శాఖల్లో సమాచార హక్కు చట్టాన్ని పారదర్శకంగా తీర్చిదిద్దాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. పథకాల అమలులో కచ్చితతత్వం, జవాబుదారితనం కోసం ఆర్‌టిఐ దోహదపడుతుందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల మంత్రిత్వశాఖ అవగాహన, శిక్షణ వంటి కార్యక్రమాలు చేపడుతోంది. పాత్రికేయులు, స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలు, సామాజిక కార్యకర్తలను ఫెలోషిప్‌కు ఎంపిక చేస్తామని చెప్పారు. చట్టం అమలుకు సంబంధించి పదివేల వాక్యాలు మించకుండా వ్యాసాలు, పరిశోధన కథనాలను ప్రోత్సహిస్తారు. ఫెలోషిప్‌కు ఎంపికయ్యేవారికి పుస్తకాలు, పరిశోధన సమాగ్రి, రవాణా, ముద్రణ, ఫిల్మ్‌లు వంటి వాటికి స్టయిఫండ్ చెల్లిస్తారని ఆ శాఖ తెలిపింది.