జాతీయ వార్తలు

కుక్కలు, గుర్రాలకూ ఇక సాహస పతకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 9: ఇప్పటివరకు యుద్ధ్భూమిలో వీరోచితంగా పోరాడిన, అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించిన సైనికులను మాత్రమే వరిస్తున్న పతకాలు ఇకముందు యుద్ధరంగంలో సైనికులతోపాటు ఉంటూ వారికి రవాణా, ఇతర వ్యూహాత్మక పనులను చేసిపెడుతున్న కుక్కలు, గుర్రాలు కూడా ధరించనున్నాయి. అవును, దేశంలో మొట్టమొదటిసారిగా యుద్ధక్షేత్రంలో సైనికులతో పాటు ఉంటూ తమకు అప్పగించిన పనిని ప్రతిభావంతంగా పూర్తి చేస్తున్న జంతువులకు కూడా పతకాలను ప్రవేశపెట్టారు. భారత్, చైనా సరిహద్దులను కాపాడుతున్న ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటిబిపి) ఈ పతకాలను ప్రవేశపెట్టింది. ‘అనిమల్ ట్రాన్స్‌పోర్ట్’, ‘కె9’ (కానైన్) పతకాలను, పనిచేసే గుర్రాలకు ‘్థబ్‌డెర్‌బోల్ట్’, ఆడ కుక్కలకు ‘సోఫియా’ పతకాలను ఐటిబిపి ప్రవేశపెట్టింది. ఐటిబిపి అవతరించి 55 ఏళ్లు పూర్తయినా సందర్భంగా త్వరలో జరుగనున్న 55వ వార్షికోత్సవం సందర్భంగా అది ఈ పతకాలను ప్రదానం చేస్తుంది. దేశంలో తొలిసారి నక్సలైట్ల వ్యతిరేక కార్యకలాపాలలో, పదాతి దళాల గస్తీ వంటి జటిలమైన విధులలో కొన్ని సంవత్సరాల క్రితం బెల్జియన్ మలినోయిస్ కుక్కలను ప్రవేశపెట్టిన ఘనత ఐటిబిపికే దక్కింది. ఐటిబిపి ఇలా తన జంతువులకు పతకాలను ప్రదానం చేయడం ఇదే తొలిసారి.
అని, ఇందుకోసం పతకాల తయారీ కోసం ఆదేశించిందని ఒక అధికారి చెప్పారు. ఇప్పటి వరకు ఉత్తమ సేవలందించిన ఈ ‘నాలుగు కాళ్ల సైనికుల’ను గుర్తించి, ఐటిబిపి చీఫ్ చేతుల మీదుగా వాటికి పతకాలను ప్రదానం చేయనున్నట్టు ఆ అధికారి వివరించారు.