జాతీయ వార్తలు

వెనక్కి వెళ్లాలంటే.. వెన్నులో వణుకు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలన్‌వాలా, అక్టోబర్ 9: కొన్ని వారాలుగా కాశ్మీర్ సరిహద్దు గ్రామాల్లో భయం తాండవించింది. ఇరువైపులా సైనికుల నిత్య ఘర్షణలతో, ఉగ్రవాద దాడులతో భయభ్రాంతులైన గ్రామస్థులు తట్టాబుట్టా సర్దుకుని ఊళ్లను వదిలి పారిపోయారు. ఆ భయం వారిలో ఇంకా కనిపిస్తూనే ఉంది. రెండుమూడు రోజుల్లో సరిహద్దుల్లో ఎలాంటి కాల్పులు లేకపోయినా, ఇళ్లను వదిలి వెళ్లిన గ్రామస్థులు మాత్రం బెంబేలెత్తిపోతున్నారు. ఈ ప్రశాంతత నివురుగప్పిన నిప్పులాంటిదేనన్న భయం వారిని వెన్నాడుతోంది. మళ్లీ తీవ్రస్థాయిలో సంఘర్షణలకు నాందిగానే ఈ ప్రశాంత పరిస్థితులను వారు అంచనా వేస్తున్నారు. రెండుమూడు రోజులుగా తమ గ్రామాల్లో ఎలాంటి కాల్పుల సంఘటనలు జరగకపోయినా, తీరా తిరిగి వెళ్లిన తరువాత మళ్లీ పాక్ నుంచి కాల్పులు జరగదన్న హామీ ఏమిటని ప్రశ్నిస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి ఎన్నో అనుభవాలు తమకున్నాయని, ఈసారి పరిస్థితి చాలా తీవ్రంగా ఉన్నందున తమ గ్రామాలకు తిరిగి వెళ్లాలంటేనే వెన్నులో వణుకు పుడుతోందని చెప్తున్నారు. ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలను భారత సైన్యం మట్టుపెట్టిన తరువాత దాదాపు 25సార్లు పాకిస్తాన్ కాల్పుల ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడింది. ఎలాంటి కవ్వింపు లేకుండానే, భారత సైనికులను సరిహద్దు గ్రామాల ప్రజలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపిందని చెప్తున్నారు. ఈ కాల్పులన్నింటిలోనూ తీవ్రంగా దెబ్బతిన్నది సరిహద్దు గ్రామాల ప్రజలేనని హమీర్‌పూర్ గ్రామానికి చెందిన 42 సంవత్సరాల శ్యాంలాల్ చెప్తున్నారు. తమ గ్రామాలకు తిరిగి వెళ్లాలన్న ఆకాంక్ష ఎంత బలంగా ఉన్నా.. ప్రాణాలు పణంగా పెట్టి తమ ఇళ్లకు వెళ్లే పరిస్థితి లేదని ఈ సరిహద్దు గ్రామాల ప్రజలు చెప్తున్నారు. ప్రస్తుతం వీళ్లంతా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సహాయ శిబిరాల్లోనే ఉంటున్నారు. తాను ఆర్గురు కుటుంబ సభ్యులతో గత కొన్ని వారాలుగా ఓ ప్రభుత్వ పాఠశాలలోనే ఆశ్రయం పొందుతున్నానని 54 ఏళ్ల శీలాదేవి తెలిపారు. ఆమె తరహాలోనే ఈ సరిహద్దు గ్రామాల ప్రజలు వెనక్కి వెళ్తే ఏం జరుగుతోందన్న ఆందోళనతో శిబిరాల్లోనే ఉండిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి, అలాగే రాష్ట్రం నుంచి తమకు పూర్తి స్థాయిలో అభయం లభించినప్పుడే తిరిగి స్వగ్రామానికి వెళ్తామని వెల్లడించారు.

కాశ్మీర్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో సురక్షిత ప్రాంతాలకు
తరలివెళ్తున్న మహిళలు పిల్లలు (ఫైల్ ఫొటో)