జాతీయ వార్తలు

అమరావతిపై స్టే ఇవ్వలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబరు 10:ఏపీ నూతన రాజధాని నగరం అమరావతి నిర్మాణంపై స్టే ఇవ్వలేదని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటి) స్పష్టం చేసింది. అయితే ట్రిబ్యునల్ తుది తీర్పునకు లోబడే అమరావతి నిర్మాణాలు చేపట్టాలని తెలిపింది. ధర్మాసనం పరిధిలో ఉన్న ఈ కేసు గురించి పిటిషనర్లు,ప్రతివాదులు మీడియాతో మాట్లాడేప్పుడు బాధ్యతతో వ్యవహరించాలని వ్యాఖ్యానించింది.
గత నెల 30న ట్రిబ్యునల్ తన ఆదేశాల్లో తుది తీర్పునకు లోబడే నగర నిర్మాణం జరగాలని ప్రకటించింది. ఆ వ్యాఖ్యాలు లిఖితపూర్వకంగా వెలువడిన ఉత్తర్వుల్లో లేవనీ, ఆ మేరకు లిఖితపూర్వకంగా ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోరారు. అయితే ధర్మాసనం వ్యాఖ్యల్ని పిటిషనర్లు వక్రీకరిస్తున్నారని, మీడియాలో తప్పుగా ప్రకటనలు ఇస్తున్నారని ప్రభుత్వం తరపు న్యాయవాది ప్రమోద్ ట్రిబ్యునల్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో అమరావతి నిర్మాణంపై స్టే లేదని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది.