జాతీయ వార్తలు

త్వరలో విశాఖ-చెన్నై కారిడార్ పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబరు 10:విశాఖ-చెనె్న పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు సంబంధించిన ఏడిబి (ఏసియా డెవలప్‌మెంట్ బ్యాంక్) అధ్యయనం పూర్తయిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి వెల్లడించారు. ఇక త్వరలోనే పనులు లప్రారంభించనున్నట్లు ఆమె తెలిపారు. ఐఐఎఫ్‌టి, ఇండియన్ ఇనిస్టిట్యూట్ అఫ్ ప్యాకేజీంగ్ సంస్థలను కాకినాడలోని ఎక్స్‌పోర్టు జోన్‌లో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించిందని చెప్పారు. ఢిల్లీలో తన కార్యాలయంలో సోమవారం నిర్మలా సీతారామన్ విదేశి ఎగుమతులు, దిగుమతులకు సంబంధించి కేంద్ర వాణిజ్యం పరిశ్రమల మంత్రిత్వ శాఖ తయారు చేసిన డాష్ బోర్డ్‌ను ప్రారంభించారు. విదేశీ ఎగుమతుల దిగుమతుల వ్యవహారాలను పూర్తి పారదర్శకతతో నిర్వహించడానికి ఈ డాష్‌బోర్డ్‌ను ఏర్పాటు చేసినట్టు ఆమె తెలిపారు. అనంతరం విలేఖరులతో మాట్లాడారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌ను విజయవాడలో ఏర్పాటు చేశామని, ఇప్పటికే తాత్కాలిక భవనంలో తరగతులను ప్రారంభిచామని చెప్పారు.