జాతీయ వార్తలు

ఈ ఘనత అందరిదీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 12: యుపిఏ హయాంలో కూడా పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై లక్షిత దాడులు జరిగాయన్న వాదనను రక్షణ మంత్రి మనోహర్ పారికర్ బుధవారం నాడిక్కడ తిరస్కరించారు. గత నెలలో ఆక్రమిత కాశ్మీర్‌లోని మిలిటెంట్ స్థావరాలపై జరిగిన సర్జికల్ దాడుల ఘనతలో ప్రధాన భాగం ప్రధాని నరేంద్ర మోదీకి చెందుతుందని, ఒకరకంగా చెప్పాలంటే భారతీయులందరిది అని ఆయన అన్నారు. లక్షిత దాడులు జరిపింది ఏ రాజకీయ పార్టీనో కాదని, అమితమైన శౌర్య సాహసాలతో సైనిక దళాలే ఈ ఘనతను సాధించాయి కాబట్టి ఇందులో 127 కోట్ల భారతీయులందరి ఆశీస్సులు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే, ఈ దాడికి ఆమోదం తెలపడంతో పాటు ఎలాంటి తొట్రుపాటుకు అవకాశం లేకుండా ప్రణాళికాబద్ధమైన రీతిలో వీటిని నిర్వహించినందుకు ఆ ఘనత మోదీకి, ఆయన సారథ్యంలోని ఎన్డీఏ సర్కారుకు చెందుతుందని అన్నారు. గతంలో కూడా ఈ రకమైన దాడులు జరిగాయన్న వాదనలో ఏమాత్రం పస లేదని, అవన్నీ కూడా అప్పటి ప్రభుత్వంతో సంబంధం లేకుండా స్థానిక స్థాయిలో జరిగిన దాడులేనని రక్షణ మంత్రి వెల్లడించారు. అయితే, తాజాగా జరిగిన దాడుల ఘనతను ప్రతి ఒక్కరితో పంచుకోవడానికి తమకెలాంటి అభ్యంతరం లేదని వెల్లడించారు. ఈ దాడులు జరిగాయా లేదా అని అనుమానం వ్యక్తం చేస్తున్నవారితో సహా అందరికీ ఈ ఖ్యాతిని పంచుతున్నామన్నారు. ఇలా చేయడం వల్ల అనేకమందికి అపోహలు తొలగిపోతాయని, వాస్తవిక దృక్పథంతో వారు వ్యవహరించేందుకు ఆస్కారముంటుందని చెప్పారు. అసలు దాడులు ఎప్పుడు జరిగాయో చెప్పండంటూ పలు రాజకీయ పార్టీల నేతలు, ఇతరులు ఆధారాలు కోరారని, ఈ రకమైన సందేహాలు వ్యక్తం చేయడమన్నది సైనిక దళాల స్థైర్యాన్ని దెబ్బతీయడమే అవుతుందని చెప్పారు. ఓపక్క ప్రభుత్వ చర్యలు సమర్థిస్తూనే, తమ హయాంలో కూడా ఈ తరహా దాడులు నిర్వహించామని కాంగ్రెస్ పేర్కొనడాన్ని ప్రస్తావించిన పారికర్ ‘గత రెండు సంవత్సరాలుగా నేను రక్షణ మంత్రిగా ఉన్నాను. నాకు తెలిసినంతవరకు ఇంతకుముందెప్పుడూ పాక్ మిలిటెంట్ స్థావరాలపై లక్షిత దాడులు జరిగినట్లుగా ఎలాంటి సమాచారం లేదు. అయితే కేవలం సరిహద్దు స్థాయిలో జరిగిన వాటినే లక్షిత దాడులుగా పేర్కొంటున్నట్లుగా స్పష్టమవుతోంది’ అని వెల్లడించారు. అయితే ఈ రకమైన దాడులను పరిస్థితి తీవ్రతను బట్టి ప్రభుత్వ ప్రమేయం లేకుండానే లేదా ముందస్తు ఆమోదంతోనే చేపడతారని తెలిపారు. అయితే గతంలో కంటే కూడా ఈసారి పరిస్థితి అత్యంత జటిలంగా తీవ్రంగా మారింది కాబట్టి లక్షిత దాడుల నిర్ణయం తీసుకుని వాటిని పకడ్బందీగా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ దాడులనుంచి ఏదో రాజకీయ ప్రయోజనం పొందాలన్న ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని, ఒకవేళ అలాంటి ఉద్దేశమే ఉంటే డిజిఎంఓకు బదులు ప్రభుత్వమే ముందుగా ఈ ప్రకటన చేసి ఉండేదని పారికర్ అన్నారు.

చిత్రం... నవీ ముంబయలో బుధవారం రక్షణ శాఖకు సంబంధించిన ఎంఇటి, హెచ్‌టిఎస్ ప్రదర్శనను ప్రారంభించిన రక్షణ మంత్రి పారికర్