జాతీయ వార్తలు

అజార్, మసూద్‌లపై చర్యలెందుకు తీసుకోరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, అక్టోబర్ 12: జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమించిన లష్కరే తోయిబా మిలిటెంట్ మసూద్ అజార్, జమాతే ఉద్ దవా అధినేత హఫీజ్ సరుూద్‌లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పాకిస్తాన్ పత్రిక ‘ది నేషన్’ప్రభుత్వాన్ని, సైనిక నాయకత్వాన్ని ప్రశ్నించింది. వీరిపై చర్య తీసుకోవడం దేశ భద్రతకు ముప్పా అని కూడా నిలదీసింది. ఇప్పటి వరకూ సైన్యానికి, ప్రభుత్వానికి అత్యంత సన్నిహితంగా వ్యవహరించిన ఈ పత్రిక పదునైన పదజాలంతో ఈ మేరకు రాసిన సంపాదకీయం కలకలం రేపుతోంది.వీరిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి ప్రభుత్వం, సైన్యం పత్రికలకు పాఠాలు చెబుతున్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ముంబయి దాడుల సూత్రధారి హఫీజ్ సరుూద్, పఠాన్‌కోట్ దాడి వ్యూహకర్త మసూద్ అజార్‌లు పాక్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నారని, వీరిద్దరికీ సైనిక రక్షణ ఉందని పేర్కొంది. సైన్యానికి, ప్రభుత్వానికి మధ్య ఉగ్రవాదులకు మద్దతు విషయంలో విభేదాలు తలెత్తాయంటూ డాన్ పత్రికలో రాసిన సిరిల్ అల్మీడాపై నిషేధం విధించినప్పటి నుంచి పాక్ మీడియా విరుచుకు పడుతూనే ఉంది. ఈ కథనాన్ని ఇటు ప్రభుత్వం, అటు సైన్యం తిరస్కరించాయి. దీన్ని కల్పితమైనదిగా అభివర్ణించాయి. ప్రధాని నవాజ్ షరీఫ్‌కు తన కథనంతో వెన్నులో వణుకు పుట్టించిన డాన్ పాత్రికేయుడికి దేశంలోని మీడియా నుంచి పూర్తి మద్దతు అందుతోంది. అల్మైదా భయపడాల్సిన ఆవసరం లేదని ది నేషన్ పత్రిక స్పష్టం చేయడం ఇందుకు నిదర్శనం. అల్మైదా కథనాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాతే ప్రచురించామని పేర్కొన్న డాన్ పత్రిక ఆయనకు వెన్నుదన్నుగా ఉంటామని ఉద్ఘాటించింది. తమ పత్రికకు చెందిన ఓ ప్రఖ్యాత పాత్రికేయుడ్ని ఓ నేరస్థుడిలా ఎలా పరిగణిస్తారంటూ ప్రభుత్వంపై డాన్ విరుచుకు పడింది.