జాతీయ వార్తలు

లక్షిత దాడులతోనే పాక్‌కు గుణపాఠం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 12: చైనా సహాయం లేకుండా పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ యుద్ధంలోనూ విజయం సాధించజాలదని బలూచిస్తాన్‌కు చెందిన స్వాతంత్య్ర సమరయోధురాలు నీలా బలోచ్ స్పష్టం చేశారు. పాకిస్తాన్‌ను అదుపు చేయాలంటే గత నెలలో జరిగినట్లుగా లక్షిత దాడులు పలుమార్లు జరగాల్సిన అవసరముందని బుధవారం నాడు ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో స్పష్టం చేశారు. పాకిస్తాన్ సైనిక పాలకులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన నీలా బలోచ్ అక్కడ ఎలాంటి శాంతియుత ప్రదర్శనలకు ఆస్కారం లేదని, ప్రజాస్వామ్య, మానవ హక్కులకు విలువే లేదని ధ్వజమెత్తారు. బలూచిస్తాన్ స్వాతంత్య్ర పోరాటానికి మద్దతు ఇస్తున్నందుకు భారత్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఆమె ‘మామూలు చెబితే పాకిస్తాన్ వినే రకం కాదు. లక్షిత దాడులతోనే దాన్ని అదుపులోకి తేవాల్సిన అవసరం ఉంది’ అని తెలిపారు. బలూచిస్తాన్ ప్రజలపై జరుగుతున్న దాడులను తక్షణమే కట్టిపెట్టాలంటూ పాకిస్తాన్‌పై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తేవాలని ఐక్యరాజ్య సమితికి పిలుపునిచ్చారు. ఇతర దేశాలతో యుద్ధంలో నెగ్గే మాట ఎలా ఉన్నా, బలూచిస్తాన్ ప్రజలతో పోరాడాలన్నా పాకిస్తాన్‌కు చైనా సహకారం కావాలని వ్యాఖ్యానించారు.