జాతీయ వార్తలు

విజయవాడ వరకూ హైస్పీడ్ రైల్ కారిడార్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబరు 14: మైసూర్-బెంగళూరు- చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్ మార్గంపై అధ్యయనాన్ని విజయవాడ వరకు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు రైల్వే మంత్రి సురేశ్ ప్రభు జర్మనీ రవాణ మంత్రి అలెగ్జాండర్ డాబ్రింట్‌కు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం రైల్ భవన్‌లో ఉభయ దేశాల మంత్రులు సమావేశమయ్యారు. భారత్‌లో రైల్వే నెట్‌వర్క్ అభివృద్ధిపై ఇరు దేశాల మధ్య కీలక చర్చలు జరిగాయి. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో నడిచే హైస్పీడ్ రైల్వే కారిడార్ ఏర్పాటుపై జర్మనీ రైల్వే విభాగం అధ్యయనం చేయాలని గతంలో రైల్వే శాఖ ప్రతిపాదించింది. మైసూరు-బెంగళూరు-చెన్నై కారిడార్ మార్గంలో ఈ హైస్పీడ్ రైల్ కారిడార్ ఏర్పాటుపై అధ్యయనం చేసేందుకు ఒప్పందం కుదిరింది. అయితే ఈ ప్రతిపాదనలో తాజాగా ఏపీలోని విజయవాడను కూడా చేర్చాలని సురేశ్ ప్రభు తాజాగా జర్మనీ మంత్రి కోరారు.