జాతీయ వార్తలు

తెరచాటు చర్చలు జరగడం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, అక్టోబర్ 14: భారత్‌తో దౌత్యపరంగా ఎలాంటి తెరచాటు చర్చలు జరగడం లేదని పాకిస్తాన్ తెలిపింది. ఇరు దేశాల మధ్య సమగ్ర చర్చల ప్రక్రియ ఇంకా నిలిచిపోయే ఉందని పాకిస్తాన్ ప్రధానమంత్రి సలహాదారు (విదేశాంగ వ్యవహారాలు) సర్తాజ్ అజీజ్ శుక్రవారం ఎక్స్‌ప్రెస్ న్యూస్ చానల్‌కు చెప్పారు. భారత్ ఎల్లవేళలా ఎలాంటి ఆధారాలు లేకుండా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందంటూ నిందిస్తోందని ఆయన పేర్కొన్నారు. భారత్‌కు స్వదేశంలో జరిగే ప్రతి ఉగ్రవాద దాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని నిందించడం అలవాటుగా మారిందని, పాకిస్తాన్ పాత్ర ఉన్నట్టు ఎలాంటి ఆధారాలు లేకుండానే ఆరోపణలు చేస్తుంటుందని ఆయన విమర్శించారు. ఐక్యరాజ్య సమితిలో చేసిన ప్రసంగాలలో పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కాశ్మీర్ వివాదం, కాశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన అంశాలపై దృష్టి కేంద్రీకరించారని ఆయన చెప్పారు. పాకిస్తాన్ దౌత్యపరంగా ఒంటరి అయిందనే వాదనను సర్తాజ్ తోసిపుచ్చారు. తమ దేశం సరయిన దిశలోనే ముందుకు సాగిందని సర్తాజ్ పేర్కొన్నట్టు పాకిస్తాన్ అధికార వార్తాసంస్థ ‘అసోసియేటెడ్ ప్రెస్ ఆఫ్ పాకిస్తాన్’ తెలిపింది. ప్రపంచ, భౌగోళిక వ్యూహాత్మక స్థాయిలలో పెద్ద ఎత్తున రాజకీయ పునరేకీకరణలు జరుగుతున్నాయని ఆయన వివరించారు. రష్యా, చైనాల వల్ల యూరప్, ఆసియా ఖండాల మధ్య బలపడుతున్న సంబంధాలు, షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఒ) క్రియాశీలత, ఆసియన్ ఇనె్వస్ట్‌మెంట్ బ్యాంక్ (ఎఐబి) ఏర్పాటు వంటివి ఈ భారీ పునరేకీకరణలను సూచిస్తున్నాయని సర్తాజ్ వివరించారు. చైనా, పాకిస్తాన్‌ల మధ్య సహకారం బలపడటం వల్ల పాశ్చాత్య దేశాలలో తమ దేశం అంటే ఆందోళన పెరిగిందని ఆయన పేర్కొన్నారు.
సబర్మతి నదీ ప్రాంతంలో
నేడు ఈటల బృందం పర్యటన
ఆంధ్రభూమి ప్రతినిధి
న్యూఢిల్లీ, అక్టోబర్ 14: సబర్మతి నదీ పరివాహక ప్రాంతాన్ని అధ్యయనం చేయడానికి తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ నేతృత్వంలో బృందం శనివారం నాడు గుజరాత్‌లో పర్యటించనుంది. సబర్మతి నదీ పరివాహక ప్రాంత తరహాలో కరీంనగర్‌లోని మిడ్‌మానేరు నదీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సంకల్పించినట్టు ఎంపీ వినోద్ వెల్లడించారు. శుక్రవారం నాడు ఆయన ఢిల్లీలోని జాతీయ ఉపరితల రవాణా శాఖ కార్యదర్శి సంజయ్ మిత్రాను కలిశారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణలో జాతీయ రహదారుల కోసం ప్రకటించిన నిధులను విడుదల చేయాలన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న రహదారి నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని మిశ్రాను కోరినట్టు ఆయన తెలిపారు.