జాతీయ వార్తలు

ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెనాలిమ్ (గోవా), అక్టోబర్ 17: అంతర్జాతీయ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సమగ్రమైన తీర్మానాన్ని (సిసిఐటి) ఐక్యరాజ్యసమితి వీలైనంత త్వరగా ఆమోదించేందుకు భారత్, బ్రెజిల్ కలిసి పనిచేయాలని తీర్మానించాయి. సోమవారం బ్రెజిల్ అధ్యక్షుడు మైకెల్ టెమెర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీల మధ్య ద్వైపాక్షిక చర్చలు సుహృద్భావంగా జరిగాయి. అణు ఇంధన సరఫరా దేశాల గ్రూపులో భారత్ సభ్యత్వానికి బ్రెజిల్ మద్దతును ప్రకటించింది. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు గోవా వచ్చిన మైకెల్ మోదీతో జరిగిన సమావేశంలో ఉగ్రవాదం విషయంలో కచ్చితమైన రీతిలో విశ్వవ్యాప్తంగా ఒకే విధమైన చర్య తీసుకోవాలన్న భారత్ ఆలోచనను సమర్థించారు. ఇరుదేశాల ఆర్థిక సంబంధాలపై కూడా సుదీర్ఘమైన చర్చలు జరిగాయి. భారత్ మార్కెట్‌ను సులువుగా అందిపుచ్చుకోవటం, పెట్టుబడుల అవకాశాలపై మోదీ, మైకెల్‌తో విపులంగా చర్చించారు. ‘‘రాష్టప్రతి మైకెల్, నేను పూర్తిస్థాయి ద్వైపాక్షిక సహకారంపై సమీక్షించాం. మన అనుబంధాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించాం. ఎన్‌ఎస్‌జిలో భారత్ సభ్యత్వానికి మద్దతు ఇచ్చిన మైకెల్‌కు కృతజ్ఞతలు. బ్రెజిల్‌తో దీర్ఘకాల వాణిజ్య సహకారాన్ని కొనసాగిస్తాం.’’ అని మోదీ ఒక ప్రకటనలో తెలిపారు. ఇద్దరు నేతలు వివిధ కంపెనీల సీఈఓలతో సమావేశమై ఆర్థిక సహకారంపై చర్చించారు. వ్యవసాయ పరిశోధన, సైబర్ సెక్యూరిటీ, మాదక ద్రవ్యాల నియంత్రణ వంటి అంశాలలో కూడా పరస్పరం సహకరించుకోవాలని ఇద్దరు నేతలు నిర్ణయించారు.

చిత్రం... గోవాలో సోమవారం బ్రెజిల్ ప్రతినిధుల బృందంతో చర్చలు జరుపుతున్న భారత్ బృందం