జాతీయ వార్తలు

16నుంచి పార్లమెంటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 19: పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబర్ 16న ప్రారంభమయి డిసెంబర్ 16తో ముగుస్తాయి. బుధవారం అధికారికంగా ఈ విషయం ప్రకటించారు. 16వ లోక్‌సభ పదో సమావేశాలు, రాజ్యసభ 241 సమావేశాలుగా ఇవి ఉంటాయి. ‘16వ లోక్‌సభ పదో సమావేశాలు 2016, నవంబర్ 16 బుధవారం ప్రారంభమవుతాయి. ఇప్పుడున్న ప్రభుత్వ కార్యక్రమాలను బట్టి ఈ సమావేశాలు డిసెంబర్ 16వ తేదీ శుక్రవారం ముగుస్తాయి’ అని లోక్‌సభ సెక్రటేరియట్ విడుదల చేసిన ఒక ప్రకటన తెలిపింది. రాజ్యసభ సెక్రటరీ జనరల్ షంషేర్ కె షెరీఫ్ కూడా ఇలాంటి ప్రకటనే జారీ చేశారు. ఇప్పటివరకు పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబర్ చివరి వారంలో ప్రారంభమయ్యేవి. అయితే ఈ సారి ఈ సమావేశాల ప్రారంభం తేదీలను ముందుకు జరిపారు. నెల రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో మన సైన్యం ఇటీవల జరిపిన సర్జికల్ దాడులు ఈ ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం ఈ దాడులను రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తోందని కొన్ని పార్టీలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. పార్లమెంటు సమావేశాలు నవంబర్ 16న ప్రారంభమయి డిసెంబర్ 16తో ముగియాలని ఈ నెల 13న ఇక్కడ సమావేశమైన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. నవంబర్ చివరివారం, లేదా డిసెంబర్ మొదటివారంలో వస్తు సేవల పన్ను(జిఎస్‌టి)కి సంబంధించిన సెంట్రల్ జిఎస్‌టి, ఇంటిగ్రేటెడ్ జిఎస్‌టి బిల్లులను ఆమోదించడానికి పార్లమెంటు సమావేశాలను ముందుగా ఏర్పాటు చేయడం వల్ల వీలవుతుంది. అలాగే బడ్జెట్ సమావేశాలను నెల రోజులు ముందుకు జరపాలని కూడా ప్రభుత్వం యోచిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరిలో ఈ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశముంది. కాగా, పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో జిఎస్‌టి కాక మరో డజను కొత్త బిల్లులను ప్రవేశపెట్టే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.