జాతీయ వార్తలు

పోలవరంపై గ్రీన్ ట్రిబ్యునల్ విచారణ వచ్చేనెల 21కి వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 19: పోలవరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటి)లో దాఖలైన పిటిషన్ విచారణ నవంబర్ 21 తేదీకి వాయిదా పడింది. ఈ ప్రాజెక్టు విషయంలో ఇదే చివరి అవకాశమని, రెండు వారాల్లో స్పందించాలని, కేంద్రం, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పర్యావరణ అనుమతులు సవాల్ చేస్తూ రేలా అని స్వచ్ఛంద సంస్థ ఎన్జీటిలో దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ స్వతంత్రకుమార్ నేతృత్వంలోని ట్రిబ్యునల్ బుధవారం నాడు విచారణ జరిపింది. పోలవరం డిజైన్‌ను రాష్ట్ర ప్రాజెక్టుగా ఉన్నప్పటి నుంచి జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించేవరకు అనేక సార్లు మార్చారని, దాని మూలంగా 2005లో ఇచ్చిన పర్యావరణ అనుమతులు ప్రస్తుతం చెల్లవని పిటిషన్ తరఫున్యాయవాది ట్రిబ్యునల్‌కు వివరించారు. ఈ పిటిషన్‌పై స్పందించడానికి కేంద్రం,ఏపీ,తెలంగాణ ప్రభుత్వాలకు ట్రిబ్యునల్ అనేకసార్లు అవకాశం ఇచ్చినా స్పందించలేదు. దీంతో చివరి అవకాశంగా ఈ కేసుపై స్పందన తెలియచేయాలని ఆదేశిస్తూ రెండు వారాల గడువుఇచ్చింది. అలాగే ఈ ప్రాజెక్టు సూపరింటెండెంట్ ఇంజినీరు ముంపుబాధితుల ఫిర్యాదులను స్వీకరించి, ఈ ఫిర్యాదులను నిరంతరం కేంద్రానికి పంపి వారి సమస్యలను పరిష్కరించాలనీ ఆదేశించింది. ఈ విషయంలో కేంద్రం కూడా నిరంతరం పర్యవేక్షణ జరపాలని పేర్కొంది. అనంతరం ప్రాజెక్టు విషయంలో రెండు వారాల్లోపు స్పందించాలని ఆదేశిస్తూ విచారణను నవంబర్ 21కి వాయిదా వేసింది.

దేశాభివృద్ధిలో రవాణా
వ్యవస్థది కీలకపాత్ర

సిఐటియు నేత పద్మనాభన్

న్యూఢిల్లీ, అక్టోబర్ 19: దేశాభివృద్థిలో రవాణా వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని సిఐటియు జాతీయ అధ్యక్షుడు ఎ.కె పద్మనాభన్ వెల్లడించారు. అలాగే ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరముందని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలో అఖిల భారత రోడ్డు రవాణ కార్మికుల సమాఖ్య (ఎఐఆర్‌టిడబ్ల్యుఎఫ్) రెండు రోజుల సదస్సు బుధవారం నాడు ప్రారంభమైంది. ఈ సదస్సులో ప్రజా రవాణ అవసరం, ఉపయోగాలు,రోడ్డు ప్రమాదాలు అనే రెండు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పద్మనాభన్ మాట్లాడుతూ దేశాలైనా,రాష్ట్రాలైనా ఆర్థిక వృద్ధి సాధించాలంటే రవాణ వ్యవస్థ బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వాలే ఆర్టీసీని నిర్వీర్యం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.