జాతీయ వార్తలు

యువకుడికి మహిళల జననాంగాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 21: ప్రపంచంలోనే అత్యంత అరుదుగా 16 ఏళ్ల వయసు కలిగిన ఒక యువకుడు ఆడవారి లైంగిక అవయవాలను కలిగివున్న ఉదంతం పశ్చిమ బెంగాల్‌లో వెలుగులోకి వచ్చింది. ఇతను మగవాడే అయినప్పటికీ మహిళ మాదిరిగా యోనితో పాటు గర్భాశయాన్ని, అండాశయాలను, అండ నాళాలను కలిగి ఉన్నాడు. వైద్య పరిభాషలో ‘పెర్సిస్టెంట్ ముల్లెరియన్ డక్ట్ సిండ్రోమ్’గా పిలిచే ఈ పరిస్థితి ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకూ కేవలం పది మందిలో మాత్రమే తలెత్తినట్లు తెలుస్తోంది. దీని నుంచి ఆ యువకునికి విముక్తి కల్పించేందుకు బెంగళూరులోని ఫోర్టిస్ ఆసుపత్రి వైద్యులు ఈ ఏడాది ఆరంభంలో అనేక శస్త్ర చికిత్సలు నిర్వహించారు. రెండు దశల్లో ఈ శస్తచ్రికిత్సలు నిర్వహించడంతో అతను ఇప్పుడు సాధారణ యువకుడిగా మారాడని వైద్యులు ప్రకటించారు.
మాజీ ఐఏఎస్ గోపాలకృష్ణకు
పాల్ హెచ్ యాపిల్బీ అవార్డు
ఆంధ్రభూమి ప్రతినిధి
న్యూఢిల్లీ,అక్టోబరు 21: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రతి సంవత్సరం ఇచ్చే ‘ది పాల్ హెచ్ యాపిల్బీ అవార్డును ఈ ఏడాది మాజీ ఐఎఎస్ అధికారి ఎం.గోపాలకృష్ణ గెలుచుకున్నారు. ఢిల్లీలో శుక్రవారం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కార్యలయంలో జరిగిన కార్యక్రమంలో మాజీ గవర్నర్ టిఎన్.చతుర్వేది చేతుల మీదుగా గోపాలకృష్ణ ఈ అవార్డును అందుకొన్నారు. సివిల్ సర్వెంట్‌గా గోపాలకృష్ణ అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఆయనను ఈ అవార్డు వరించింది. తెలుగు ఐఏఎస్ అయిన గోపాలకృష్ణ అస్సాం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ విభాగాల్లో పనిచేశారు.
ఇమ్రాన్, ఖాద్రిలను
అరెస్టు చేయండి
పోలీసులకు పాక్ ఉగ్రవాద వ్యతిరేక కోర్టు ఆదేశం
ఇస్లామాబాద్, అక్టోబర్ 21: రెండేళ్ల క్రితం నిర్వహించిన ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శన సందర్భంగా పాకిస్తాన్ టెలివిజన్ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి కేసులో పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పిటిఐ) పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్, మత నాయకుడు తహిరుల్ ఖాద్రిని నవంబర్ 17లోగా అరెస్టు చేయాలని ఇస్లామాబాద్‌లోని ఉగ్రవాద వ్యతిరేక కోర్టు శుక్రవారం పోలీసులను ఆదేశించింది. కోర్టు తాను గతంలో జారీ చేసిన అరెస్టు వారంట్లను అమలు చేయడంలో పోలీసులు విఫలమైన తరువాత పిటివిపై జరిగిన దాడుల కేసు విచారణ సందర్భంగా శుక్రవారం ఈ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో పోలీసులు విఫలం కావడం పట్ల న్యాయమూర్తి కౌసర్ అబ్బాస్ జైదీ ఆగ్రహం వ్యక్తం చేశారని కోర్టుకు చెందిన ఒక అధికారి వెల్లడించారు. ఇమ్రాన్ ఖాన్, పాకిస్తాన్ అవామి తెహ్రీక్ అధినేత, ప్రముఖ మత నాయకుడు తహిరుల్ ఖాద్రితో పాటు పిటివిపై దాడికి పాల్పడిన ఆ రెండు పార్టీలకు చెందిన 68 మందిని నవంబర్ 17లోగా అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరచాలని న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు.

అరెస్టులే సమాధానం కాదు
జయ వదంతులపై ఎన్‌హెచ్‌ఆర్‌సి స్పందన
న్యూఢిల్లీ, అక్టోబర్ 21: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై వదంతులు వ్యాప్తిచేస్తున్నారని పలువురిని అరెస్టు చేయడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్‌సి) స్పందించింది. ఎన్‌హెచ్‌ఆర్‌సి చైర్‌పర్సన్ హెచ్‌ఎల్ దత్తు శుక్రవారం నాడిక్కడ మాట్లాడుతూ‘ అరెస్టులే సమాధానం కాదు. అలాంటివి పుకార్లు పుట్టకుండా ఉండాలంటే చాలా మార్గాలున్నాయి’అని స్పష్టం చేశారు.తమ అభిప్రాయాన్ని వెల్లడించే స్వేచ్ఛ ప్రజలకు ఉందని ఆయన గుర్తుచేశారు. వదంతులు రావడానికి గల కారణాలు అనే్వషించాలే తప్ప అరెస్టులే సమస్యకు పరిష్కారం కాదని దత్తు పేర్కొన్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దత్తు మీడియాతో ముచ్చటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గత నెల 22న తీవ్ర అస్వస్థతతో అపోలో ఆసుపత్రిలో చేరారు. తీవ్రమైన జ్వరం, డిహైడ్రేషన్‌తో బాధపడుతున్న జయ ఆరోగ్యంపై సామాజిక మాద్యమాల్లో అనేక వదంతులు వ్యాపించాయి. ఫేస్‌బుక్,వాట్సప్‌లలో సిఎం ఆరోగ్యంపై అనేక కథనాలు వెలువడ్డాయి. దీంతో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సైబర్ నిపుణులను ఆశ్రయించింది. వదంతులు వ్యాప్తిచేస్తున్న వారిపై కేసులు నమోదు చేయడమే కాకుండా పలువురిని అరెస్టు చేశారు. ఇప్పటికి 43 మందిపై కేసులు నమోదు చేశారు. మణి సెల్వం అనే 28 ఏళ్ల బ్యాంకు ఉద్యోగి, బాల సుందరం(42)ను సెంట్రల్ చెన్నై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈనెల 13న అరెస్టు చేశారు.