జాతీయ వార్తలు

దౌత్యాన్ని వినోదంగా మార్చడం సరికాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 25: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం అకస్మాత్తుగా పాకిస్తాన్ పర్యటనకు వెళ్లడం ప్రతిపక్షాన్ని ఆశ్చర్యపరిచింది. ఇలాంటి అనాలోచిత, అకస్మిక పర్యటనల వలన ఎలాంటి లాభం ఉండదని కాంగ్రెస్ విమర్శిస్తే, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ మాత్రం మోదీ లాహోర్ పర్యటనను గట్టిగా సమర్థించారు. పొరుగు దేశాల విషయంలో ఇలానే వ్యవహరించాలి, స్నేహమంటే ఇదే కదా అని ఆమె వ్యాఖ్యానించారు. అఫ్గానిస్తాన్ పర్యటన నుండి స్వదేశానికి తిరిగి రావాల్సిన నరేంద్ర మోదీ శుక్రవారం మధ్యాహ్నం ఆకస్మికంగా లాహోర్‌లో దిగి పాకిస్తాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలపడం తెలిసిందే. అఫ్గానిస్తాన్ నుండి బయలుదేరే ముందు షరీఫ్‌కు మోదీ టెలిఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మోదీ చేసిన ఈ ఫోన్‌కాల్ మూలంగా లాహోర్ పర్యటన జరిగిందని విదేశీ వ్యవహారాల శాఖ అధికారులు చెబుతున్నారు. మోదీ శుక్రవారం అకస్మాత్తుగా లాహోర్‌లో పర్యటించడం ఆయన దురదృష్టకర సాహసానికి నిదర్శనమని, దౌత్యాన్ని వినోదంగా మార్చటం ఎంతమాత్రం మంచిది కాదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మనీష్ తివారీ విమర్శించారు. ఆఖరుసారి అటల్ బిహారీ వాజపేయి లాహోర్ వెళ్లినప్పుడు కార్గిల్ దురాగతం జరిగింది, ఇప్పుడు మోదీ వెళ్లి వచ్చిన తరువాత ఎలాంటి దురాగతం ఎదురవుతుందో? అని తివారీ వ్యాఖ్యానించారు. మోదీ లాహోర్ పర్యటన బిజెపి ద్వంద్వ నీతికి నిదర్శనమని మరో కాంగ్రెస్ నాయకుడు రాజీవ్ శుక్లా విమర్శించారు. మోదీ - షరీఫ్ సమావేశం కావటం మంచిదే కానీ తాము పాకిస్తాన్ వైపు చూసినా విమర్శించటం అర్థం కావటం లేదని అన్నారు. ఎంఐఎం అధినేత, లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ, జమ్ముకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా మోదీ లాహోర్ పర్యటనను సమర్థించారు. మోదీ లాహోర్ పర్యటనను స్వాగతిస్తున్నానని ఒవైసీ ట్వీట్ చేశారు. పాకిస్తాన్ ప్రభుత్వం 26/11 కేసు దర్యాప్తును త్వరగా పూర్తి చేయటంతోపాటు దేశాల మధ్య మరిన్ని చర్చలకు తోడ్పడతారని ఆశిద్దామని ఆయన వ్యాఖ్యానించారు.
పాకిస్తాన్‌తో మళ్లీ చర్చల ప్రక్రియ ప్రారంభం కావటం శుభసూచకమని ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. మోదీ లాహోర్ పర్యటనను స్వాగతిస్తున్నానని అంటూనే ఇలాంటి సంఘటనలు బాగానే ఉంటాయి కానీ గట్టి పనులు జరగవలసి ఉన్నదని ఆయన అభిప్రాయపడ్డారు.