జాతీయ వార్తలు

‘అంకె’లతోపాటు ఆరోగ్యమూ ముఖ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంక్లేశ్వర్, అక్టోబర్ 23: ప్రపంచ దేశాలలో భారత్ సముచితమైన స్థానాన్ని పొందాలంటే స్థూల జాతీయోత్పత్తి అంకెలు మాత్రమే సరిపోవని, పౌరులందరికీ అందుబాటులో ఉండే ఆధునిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను కలిగి ఉండాలని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఉద్బోధించారు. గుజరాత్‌లోని భారుచ్ జిల్లా అంక్లేశ్వర్‌లో ఆదివారం ఆయన సర్దార్ పటేల్ మల్టీ స్పెషాలిటి అండ్ హార్ట్ హాస్పిటల్‌ను ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ ఎంపి, ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ వ్యవస్థాపక ట్రస్టీగా ఉన్న ట్రస్టీల బోర్డు, దాతలు కలసి ఈ ఆసుపత్రిని నిర్మించారు. శారీరక, మానసిక సామర్థ్యం లేకుండా పనిచేయజాలమని, ప్రపంచ దేశాలలో భారత్‌కు సముచిత స్థానం దక్కాలంటే ఇది అత్యవసరమని రాష్టప్రతి పేర్కొన్నారు. రోగులు, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రజలతో కూడిన ఏ దేశమూ ప్రపంచ క్షేత్రంలో పోటీ పడజాలదని అన్నారు. పౌరులందరికీ ఉద్యోగాలు, జీవనోపాధి కల్పించవలసిన అవసరం ఉందని, ఇది సాధించాలంటే ప్రజలంతా కలసికట్టుగా భాగస్వాములు కావలసి ఉందని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఇదే తొలి సూపర్ స్పెషాలిటి ఆసుపత్రి అని పేర్కొంటూ, ఈ ఆసుపత్రి ద్వారా ఈ ప్రాంతంలోని ప్రజలందరికీ మంచి ఆరోగ్య సంరక్షణను అందించాలని ఆసుపత్రి ట్రస్టీలు, వైద్యులను కోరారు. అంతకుముందు రాష్టప్రతి భారుచ్‌లో ఆధునీకరించిన ‘సేవాశ్రమ్’ ఆసుపత్రిని సందర్శించారు. మహాత్మా గాంధీ, సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ విగ్రహాలను ఆవిష్కరించారు. గుజరాత్ గడ్డపై జన్మించిన ఈ నేతలు దేశానికి స్వాతంత్య్రం తీసుకు రావటానికి పాటుపడటమే కాకుండా దేశ భవిష్యత్తుకు గట్టి పునాది వేశారని ప్రణబ్ ముఖర్జీ కొనియాడారు.
భారుచ్‌లో తొలి సూపర్ స్పెషాలిటి ఆసుపత్రిని నెలకొల్పాలనే కలను నిజం చేయడానికి పూనుకున్న అహ్మద్ పటేల్‌ను కూడా ఆయన ప్రశంసించారు.
chitram...
గుజరాత్‌లోని అంక్లేశ్వర్‌లో సర్దార్ పటేల్ మల్టీ స్పెషాలిటి హార్ట్ హాస్పిటల్‌ను ప్రారంభించి అందులోని సౌకర్యాలను పరిశీలిస్తున్న రాష్టప్రతి ప్రణబ్