జాతీయ వార్తలు

దేశీయ ఉత్పత్తులకు మరింత ఆదరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 23: వస్తుసేవల పన్ను అమల్లోకి వచ్చిన తరువాత దేశీయంగా వివిధ ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతుందని, అదేవిధంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం వ్యాఖ్యానించారు. ఇక్కడ జరిగిన అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సదస్సు ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు.
వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు పన్నులవల్ల కునారిల్లిన దేశీయ మార్కెట్ జిఎస్‌టితో చక్కబడుతుందని ఆయన అన్నారు. ‘అంతర్రాష్ట్ర వాణిజ్యంతో సమీకృత జాతీయ మార్కెట్ వ్యవస్థీకృతమవుతుంది. దీనివల్ల ఉపాధి అవకాశాలూ పెరుగుతాయి’ అని ఆయన అన్నారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఆకర్షణీయమైన రంగాలు భారత్‌లో ఉన్నాయని మోదీ అన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మనం మంచి స్థానంలో ఉన్నామని ఆయన అన్నారు. మనకు ఉన్న ప్రధాన బలాలు ప్రజాస్వామ్య వ్యవస్థ, భౌగోళికంగా ఉండే అనుకూల పరిస్థితులు, డిమాండ్‌లని, వీటిని మరింత బలోపేతం చేసుకోవాలని ఆయన అన్నారు. సుస్థిరమైన ఆర్థిక వృద్ధి సాధించాలంటే దీర్ఘకాలిక పెట్టుబడులు అవసరమని ఆయన వ్యాక్యానించారు. దేశం డిజిటల్ విప్లవం సాధించే దిశగా దూసుకుపోతోందని, ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
సైనికులకు దీపావళి సందేశాలు పంపండి
సరిహద్దుల్లో భారత సైన్యానికి దేశ ప్రజలు దీపావళి శుభాకాంక్షలు పంపించాలని ప్రధాన మంత్రి మోదీ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘మైగవ్.ఇన్’ వెబ్‌సైట్ ద్వారా నిర్వహిస్తున్న నరేంద్రమోదీ యాప్‌లో ‘సందేశ్2సోల్జర్స్’ అనే ప్రచార కార్యక్రమాన్ని మోదీ ఆదివారం ప్రారంభించారు. అంతేకాకుండా ఆకాశవాణి, దూరదర్శన్‌ల ద్వారా కూడా సైనికులకు సందేశాలు పంపించవచ్చని ఆయన పేర్కొన్నారు. ‘నేను సందేశ్2సోల్జర్స్ ద్వారా నా దీపావళి శుభాకాంక్షలు పంపించాను. మీరూ పంపించండి. మీ శుభాకాంక్షలు మన సైనికులకు సంతోషాన్నిస్తాయి. ఈ దీపావళి మన దేశానికి నిరంతరం రక్షణ కల్పిస్తున్న మన వీర జవానులను మనమంతా గుర్తు చేసుకోవాలి. జైహింద్’ అని మోదీ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.

చిత్రం... ఢిల్లీలో జరుగుతున్న అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సదస్సులో పాల్గొనేందుకు వస్తున్న ప్రధాని మోదీ