జాతీయ వార్తలు

హిందుత్వ తీర్పుపై పునఃసమీక్ష లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 25: హిందుత్వం జీవన విధానమని పేర్కొంటూ 1995లో వెలువరించిన ప్రఖ్యాత తీర్పును పునఃసమీక్షించేది లేదని సుప్రీం కోర్టు మంగళవారం స్పష్టం చేసింది. తమకు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం నివేదించిన పరిశీలనాంశాల్లో ఈ అంశం లేదని, దీని దృష్ట్యా హిందుత్వ అంశంపై విస్తృత స్థాయి చర్చ జరిపే ప్రసక్తి లేదని వెల్లడించింది. హిందుత్వం అంటే ఏమిటో..దాని అర్థమేమిటో నిర్వచించే అంశాల జోలికి తాము పోవడం లేదని ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ సారథ్యంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తేల్చిచెప్పింది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 123(3) సెక్షన్ పరిధిని, విస్తృతిని మాత్రమే తాము పరిశీలిస్తున్నామని వివరించింది. అవినీతి పద్ధతులుగా పేర్కొనే ఎన్నికల అక్రమాలు, ఇతర అంశాలపైనే తాము దృష్టి పెట్టామని వెల్లడించింది. ఓ వ్యక్తి కులం,మతం, భాష తదితర అంశాల ఆధారంగా అతడికి ఓటు వేయమనడం లేదా వేయకూడదని చెప్పడం అవినీతి చర్యే అవుతుందని ఈ సెక్షన్ స్పష్టం చేస్తోంది.ప్రస్తుతానికి తామకు నివేదించిన అంశానికే తాము పరిమితం అవుతామని సుప్రీం కోర్టు వివరించింది. ఈ నివేదనలో హిందుత్వ అంశం కూడా ఉందని ఎవరైనా నిర్ధారించే పక్షంలో ఆ అంశాన్ని కూడా పరిశీలిస్తామని సుప్రీం బెంచి పేర్కొంది.