జాతీయ వార్తలు

రాష్టప్రతి వేతనం మూడు రెట్లు పెంపు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 25: భారత రాష్టప్రతి, ఉపరాష్టప్రతి వేతనాలు భారీగా పెరగనున్నాయి. ఎంతగా అంటే ఇప్పుడున్న వేతనాలకు దాదాపు మూడు రెట్లు పెరగనున్నాయి. హోం మంత్రిత్వ శాఖ ఒక ప్రతిపాదనను ఇప్పటికే సిద్ధం చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏడవ వేతన సంఘం సిఫార్సులను అమలు చేయడంతో దేశ ప్రథమ పౌరుడు, ఆ తర్వాతి స్థానమైన ఉపరాష్టప్రతి వేతనాలను సైతం పెంచాల్సిన పరిస్థితి వచ్చింది. వేతన సంఘం సిఫార్సులను అమలు చేసిన తర్వాత అత్యున్నత బ్యూరోక్రాట్ అయిన క్యాబినెట్ సెక్రటరీ నెలసరి వేతనం రూ. 2.5 లక్షలుండగా ఇతర సెక్రటరీల వేతనాలు 2.25 లక్షలుగా ఉండబోతోంది.అయితే రాష్టప్రతి వేతనం లక్షన్నర, ఉపరాష్టప్రతి వేతనం లక్షా 25 వేల రూపాయలుగా ఉంటోంది. అలాగే రాష్ట్రాల్లో ప్రథమ పౌరుడయిన గవర్నర్ వేతనం లక్షా పది వేల రూపాయలు మాత్రమే ఉంది. కాగా, రాష్టప్రతి వేతనాన్ని 5 లక్షలకు, ఉప రాష్టప్రతి వేతనం 3.5 లక్షలకు, గవర్నర్ వేతనాన్ని 3 లక్షల రూపాయల దాకా పెంచాలని హోం మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. చివరిసారిగా రాష్టప్రతి, ఉపరాష్టప్రతి, గవర్నర్ల వేతనాలను 2008లో పెంచారు. అప్పటివరకు రాష్టప్రతి వేతనం 50 వేలు, ఉపరాష్టప్రతి వేతనం 40 వేలు, గవర్నర్ వేతనం 36 వేలుగా ఉండేది. రాష్టప్రతి, ఉపరాష్టప్రతి, గవర్నర్ల వేతనాలతో పాటుగా మాజీ రాష్టప్రతులు, ఉపరాష్టప్రతులు మాజీ గవర్నర్లు, దివంగత రాష్టప్రతులు, ఉపరాష్టప్రతులు, గవర్నర్ల జీవిత భాగస్వాముల పింఛన్లను కూడా ఇదే దామాషాలో పెంచాలని కూడా ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.