జాతీయ వార్తలు

బకాయిలు ఇప్పించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 25: తెలంగాణలోని వివిధ నీటిపారుదల పథకాలకు కేంద్రం నుంచి రావాల్సిన దాదాపు వెయ్యి కోట్ల నిధులు రెండు మూడు రోజుల్లో విడుదల చేయించాలని కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతిని కోరినట్టు రాష్ట్ర నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ప్రధాన మంత్రి కృషి సించాయి పథకం కింద 80 వేల కోట్లతో దేశంలో చేపట్టిన 99 నీటిపారుదల పథకాల నిర్మాణంపై ఉమాభారతి అధ్యక్షతన మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి హాజరైన హరీశ్‌రావు, అనంతరం మీడియాతో మాట్లాడుతూ నీటి పథకాలకు కేంద్రం గ్రాంటుతోపాటు నాబార్డ్ రుణ సాయం ఇప్పించటాన్ని ప్రస్తావించామన్నారు. రాష్ట్ర రుణ పరిమితికి మించి రుణాలు ఇప్పించటం వల్ల పథకాలు త్వరగా పూర్తవుతాయన్న విషయాన్ని సూచించామన్నారు. తెలంగాణకు సంబంధించి మూడు ప్రధానాంశాలను కేంద్ర మంత్రికి ప్రతిపాదించినట్టు చెప్పారు. పిఎంకెవై కింద తెలంగాణలో చేపడుతున్న ప్రాజెక్టులకు నాబార్డు నుంచి ఏడు వేల కోట్ల రుణాన్ని రాష్ట్రం కోరుతోంది. నాబార్డు రుణాన్ని రాష్ట్ర రుణ పరిమితి పరిధిలోకాకుండా, వెలుపల ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరామన్నారు. దేవాదుల ప్రాజెక్టువున్న వరంగల్ జిల్లాను తీవ్రవాద ప్రభావమున్న వెనుకబడిన ప్రాంతంగా, రైతు ఆత్మహత్యలు అధికంగా జరుగుతున్న కరవు జిల్లాగా గుర్తించి కేంద్రం ఇస్తున్న గ్రాంటును 25 నుంచి 60 శాతానికి పెంచాలని విజ్ఞప్తి చేశామన్నారు. మిషన్ కాకతీయకు ఐదు వేల కోట్లు ఇవ్వాలన్న నీతి ఆయోగ్ సిఫార్సులు అమలయ్యేలా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో మాట్లాడి నిధులు విడుదల చేయించాలని కోరారు. అలాగే, రాజీవ్ బీమా పథకం, ఎస్‌ఆర్‌ఎస్‌పి-2 ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు సైతం త్వరగా విడుదల చేయించాలని మంత్రికి విజ్ఞప్తి చేశామన్నారు. తెలంగాణ ప్రతిపాదనలు, విజ్ఞప్తులపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో చర్చించి నిధుల విడుదలకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారన్నారు. కృష్ణా ట్రిబ్యునల్ తీర్పుపై మాట్లాడుతూ, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని సుప్రీం కోర్టుకు విన్నవించేందుకు రాష్ట్ర న్యాయవాది వైద్యనాథన్‌ను 29న ఢిల్లీకి ఆహ్వానించామన్నారు. ఈ అంశంపై సిఎం కెసిఆర్ ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం 29న మరోసారి సమావేశమై తీర్పు తదుపరి చర్యలపై ఒక నిర్ణయానికి వస్తారని హరీశ్ వివరించారు.