జాతీయ వార్తలు

ఉరీ దాడి మేమే చేశాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 25: గత నెల జమ్మూ, కాశ్మీర్‌లోని ఉరీ సైనిక స్థావరంపై దాడి చేసింది తామేనని పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ప్రకటించుకుంది. ఈ దాడిలో 20 మంది భారతీయ జవాన్లు చనిపోయిన విషయం తెలిసిందే. దాడికి పాల్పడిన నలుగురు ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుపెట్టింది. ఈ నలుగురిలో ఒకరి అంత్యక్రియలు ఈ నెల 25న జరుగుతాయని లష్కరే తోయిబా పేరుతో పాకిస్తాన్ పంజాబ్ రాష్ట్రంలోని గుజ్రన్‌వాలా ప్రాంతంలో వాల్‌పోస్టర్లు వెలిశాయి. ప్రత్యేక ప్రార్థనల తర్వాత లష్కరే తోయిబా మాతృసంస్థ అయిన జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సరుూద్ ప్రత్యేక ప్రసంగం చేస్తారని కూడా ఆ పోస్టర్లలో ఉంది. దాడి చేసిన ఉగ్రవాదులు పాక్‌వైపునుంచే వచ్చారని ఉరీ దాడి జరిగిన రోజునుంచి మన దేశం చెప్తూ వస్తున్న విషయం, పాక్ ప్రభుత్వం ఈ మాటలను ఖండించడం విదితమే. అయితే ఇప్పుడు లష్కరే తోయిబా వాల్‌పోస్టర్లతో భారత్ వాదనకు ఊతం లభించినట్లయింది. భారత సైనిక స్థావరంపై దాడిచేసి లష్కరే తోయిబాకు చెందిన మహమ్మద్ అనస్ అలియాస్ అబూ సిరాఖా అమరుడైనట్లు ఉర్దూలో ఉన్న ఆ పోస్టర్లలో పేర్కొన్నారు. గుజ్రన్‌వాలా ప్రాంతానికి చెందిన ఇతని సంస్మరణార్థం జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొనాలని స్థానికులను ఆ పోస్టర్‌లో ఆ సంస్థ ఆహ్వానించింది. అయితే లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఈ దాడిలో 177 మంది భారతీయ సైనికులను హతమార్చినట్లు ఈ పోస్టర్‌లో పేర్కొనడం గమనార్హం. గుజ్రన్‌వాలాలోని గిరిజాఖ్ సమీపంలో ఉన్న బడానల్లా వద్ద అంత్యక్రియల ప్రార్థనా సమావేశం జరుగుతుందని కూడా ఆ పోస్టర్‌లో పేర్కొన్నారు.