జాతీయ వార్తలు

కోలుకున్న ‘అమ్మ’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, అక్టోబర్ 26: అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితి మరింత మెరుగైందని పార్టీ వర్గాలు బుధవారం వెల్లడించాయి. తమ అధినేత్రి త్వరలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అవుతారని ప్రకటించారు. మరోపక్క జయ త్వరగా కోలుకోవాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ‘జయ ఆరోగ్య పరిస్థితి సంతృప్తికరంగా ఉంది. దేవుని దయవల్ల ఆమె కోలుకున్నారు. త్వరలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జయి ఇంటికి వస్తారు’ అని అన్నాడిఎంకె అధికార ప్రతినిధి సిఆర్ సరస్వతి తెలిపారు. తమ అధినేత్రికి వైద్య సేవలందించిన సింగపూర్, ఎయిమ్స్ నిపుణులకు కార్యకర్తల తరుఫున ఆమె కృతజ్ఞతలు తెలిపారు. 68 ఏళ్ల జయలలిత గత నెల 22న అపోలో ఆసుపత్రిలో చేరారు. తీవ్ర జ్వరం, డిహైడ్రేషన్‌తో ఆమె ఆసుపత్రిలో చేరారు. జయకు ఇన్‌ఫెక్షన్ సోకిందని, కృత్రిమ శ్వాస అందిస్తూ వైద్య చికిత్స చేస్తున్నట్టు అపోలో వైద్యులు అప్పట్లో చెప్పారు. అక్టోబర్ 21 బులెటిన్‌లో ముఖ్యమంత్రికి యాంటీ బయోటిక్స్ ఇస్తున్నామని, వైద్యానికి ఆమె బాగా స్పందిస్తున్నారని వెల్లడించారు. అమ్మ త్వరగా కోలుకోవాలంటూ పుదుకొట్ట జిల్లా విరాలిమలైలో 20వేల మంది సంప్రదాయ పల్కుదాం కార్యక్రమంలో పాల్గొన్నారు. జయకోసం తిరునెల్వెలిలో ‘తవిల్’, ‘నాగస్వర’ విధ్వాంసులు ఆరు గంటలసేపు నిరంతరాయంగా సంగీత కార్యక్రమం నిర్వహించారు. మరోపక్క జయలలిత స్వయంగా ఆహారం తీసుకుంటున్నారని, దీపావళి ముందే ఆమెను డిశ్చార్జ్ చేస్తారన్న కథనాలు వెలువడుతున్నాయి. దీనికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుసుకున్న పార్టీ వర్గాలు సంబరాల్లో మునిగిపోయాయి.
chitram...
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ బుధవారం చెన్నైలో రక్తదానం చేస్తున్న ఎఐఎడిఎంకె కార్యకర్తలు