జాతీయ వార్తలు

సాయుధ బలగాలు.. సర్కారుకు జవాబుదారే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 28: సాయుధ బలగాలు ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండవలసి ఉంటుందని, లేకుం టే దేశంలో సైనిక శాసనం (మార్షల్ లా) అమలవుతుందని సుప్రీంకోర్టు శుక్రవారం పేర్కొంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పిఒకె)లో భారత సైన్యం జరిపిన లక్షిత దాడుల అంశంలో జోక్యం చేసుకొని, ఆ దాడుల ఘనత తమదేనని ప్రకటించుకున్న రక్షణ మంత్రి మనోహర్ పారికర్‌పై చర్య తీసుకోవాలని అభ్యర్థిస్తూ దాఖలయిన పిటిషన్‌ను తోసిపుచ్చుతూ న్యాయమూర్తులు అమితవ రాయ్, యుయు లలిత్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ‘ఈ పిటిషన్ విచారణకు అర్హమైనది కాదు. అందువల్ల దీన్ని కొట్టివేయడం జరిగింది. సాయుధ బలగాలు ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండాలి. లేనిపక్షంలో దేశంలో సైనిక శాసనం ఉంటుంది. ఈ పిటిషన్‌లో విచారణకు స్వీకరించవలసిన యోగ్యత మాకు కనిపించలేదు’ అని ధర్మాసనం పేర్కొంది. ఈ పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది ఎంఎల్ శర్మ తన వాదన వినిపిస్తూ రక్షణ మంత్రి మనోహర్ పారికర్ సహా కొంతమంది కేంద్ర మంత్రులు భారత సైన్యం జరిపిన లక్షిత దాడులను తమ ఘనతగా ప్రకటించుకున్నారని తెలిపారు. రాజ్యాం గ నిబంధనల ప్రకారం రాష్టప్రతి సాయుధ బలగాలకు అధిపతి అని, అందువల్ల ఆ ఘనత తమదని కేంద్ర మంత్రులు చెప్పుకోవడానికి వీలు లేదని వాదించారు. సాయుధ బలగాల చర్యను కొంతమంది తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారని వాదిస్తూ, అందువల్ల వారిని ప్రాసిక్యూట్ చేయాలని సుప్రీంకోర్టును అభ్యర్థించారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ ‘ఇందులో వ్యక్తిగత ప్రయోజనం ఏముంది? సాయుధ బలగాలు ప్రభుత్వానికి జవాబుదారీ వహించాల్సిందే’ అని పేర్కొంది. ఈ పిటిషన్‌కు విచారణకు స్వీకరించవలసిన అర్హత లేదని, అందువల్ల కొట్టివేస్తున్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది.