జాతీయ వార్తలు

వారంలో 15 మంది పాక్ రేంజర్లు హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ, అక్టోబర్ 28: కాల్పుల విరమణ ఒప్పందానికి పదేపదే తూట్లు పొడుస్తున్న పాకిస్తాన్ సైనిక బలగాలు జమ్మూ-కాశ్మీరులోని సరిహద్దు ప్రాంతాల వెంబడి మరోసారి కాల్పులకు తెగబడ్డాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు భారత పౌరులు మృతిచెందడంతో తాము దీటుగా జవాబిచ్చామని, గత వారం రోజులుగా జరిగిన ఎదురు కాల్పుల్లో 15 మంది పాక్ రేంజర్లు హతమయ్యారని సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్) శుక్రవారం వెల్లడించింది. జమ్మూ, కథువా, పూంచ్, రాజౌరీ జిల్లాల్లో అంతర్జాతీయ సరిహద్దు (ఐబి)తో పాటు నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి భారత సైనిక పోస్టులు, జనావాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాక్ రేంజర్లు ఫిరంగులు, ఆటోమ్యాటిక్ ఆయుధాలతో భారీగా కాల్పులకు తెగబడ్డారని, ఈ కాల్పులకు ఉపయోగించిన మందుగుండును చూస్తుం టే అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్ రేంజర్లకు ఆ దేశ సైనిక దళం మద్దతు తెలుపుతున్నట్లు స్పష్టమవుతోందని బిఎస్‌ఎఫ్ పేర్కొంది. కథువా సెక్టార్‌లో గురువారం సాయం త్రం 5.20 గంటలకు పాక్ రేంజర్లు ఎటువంటి కవ్వింపులు లేకుండానే భీకర కాల్పులకు దిగారని, ఆ తర్వాత ఈ కాల్పులు హీరానగర్, సాంబా సెక్టార్లకు విస్తరించి శుక్రవారం తెల్లవారు జాము 5 గంటల వరకు కొనసాగాయని బిఎస్‌ఎఫ్ అదనపు డైరెక్టర్ జనరల్ అరుణ్ కుమార్ జమ్మూలో విలేఖరులకు వివరించారు. పాక్ రేంజర్లకు భారత బలగాలు గట్టిగా బుద్ధి చెబుతున్నాయని, బిఎస్‌ఎఫ్ సిబ్బంది జరిపిన ఎదురు కాల్పుల్లో 15 మంది పాక్ రేంజర్లు హతమవడంతో పాటు వారికి చెందిన పలు ఔట్ పోస్టులు ధ్వంసమయ్యాయని ఆయన తెలిపారు. ఇదిలావుంటే, పాక్ రేంజర్లు జరిపిన కాల్పుల వలన పల్లన్‌వాలా సెక్టార్‌లోని ఖౌర్ బెల్టులో ఒక పౌరుడు, పూంచ్ జిల్లాలోని గోహ్లాద్ గ్రామంలో ఉస్మా బీ అనే 50 ఏళ్ల మహిళ మృతిచెందగా, ఆర్‌ఎస్ పురా సెక్టార్‌లో మరొక పౌరుడు గాయపడ్డాడని అధికారులు తెలిపారు.

సరిహద్దు ప్రాంతాల్లో ఎదురు కాల్పులతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఆవాసాలు వదిలి తరలిపోతున్న కాశ్మీర్ ప్రజలు