జాతీయ వార్తలు

పిరికిపందల ఆయుధం ఉగ్రవాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నోయిడా, అక్టోబర్ 28: పాకిస్తాన్ ఉగ్రవాదం సాయం తీసుకుని పరోక్ష యుద్ధానికి పాల్పడుతోందని, అయితే పిరికి పందలే ఇలాంటి దాడుకు పాల్పడుతారని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ‘మన పొరుగుదేశం (పాకిస్తాన్) పరోక్ష యుద్ధాన్ని కొనసాగిస్తోంది. అయితే ఉగ్రవాదం సాహసవంతుల ఆయుధం కాదు, పిరికిపందల ఆయుధం. ముందునుంచి కాకుండా వెనకనుంచి పోరా టం చేసే వారిని పిరికివాళ్లని అంటా రు..అలాంటి వాళ్లే ఉగ్రవాదం సా యం తీసుకుంటారు’ అని శుక్రవారం ఇక్కడికి సమీపంలోని నోయిడాలో సరిహద్దు భద్రతా దళమైన ఇండో- టిబెటన్ సరిహద్దు పోలీసు( ఐటిబిపి) 55వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ రాజ్‌నాథ్ అన్నారు. ఐటిబిపి గట్టి నిఘా కారణంగా భారత భూభాగంలోకి చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ చొరబాట్లు ఈ ఏడాది 60 శాతం తగ్గాయని రాజ్‌నాథ్ అన్నారు.
భారత్, పాకిస్తాన్‌ల మధ్య ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్రిక్తతలను రాజ్‌నాథ్ ప్రస్తావిస్తూ ఉగ్రవాదానికి పాల్పడ్డం ద్వారా భారత్‌కు హాని చేయడానికి, దేశాన్ని ముక్కలు చేయడానికి, అస్థిరపరచడానికి పొరుగుదేశం ప్రయత్నిస్తోందన్నారు. ప్రపంచంలో శరవేగంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న దేశాల్లో భారత్ ఒకటని, భారత్ అభివృద్ధి చూసి పాక్‌కు కన్నుకుడుతోందని ఆయన అన్నారు. గత నెల 7న ఉగ్రవాదులు ఉరీ సైనిక స్థావరంపై దాడి చేసి 19 మంది భారత జవాన్లను హతమార్చినప్పటినుంచి భారత్-పాక్ సరిహద్దు వెంబడి ఉద్రిక్తత కొనసాగుతున్న విషయం తెలిసిందే. గత నెల 27న పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై మెరపుదాడులు జరపడం ద్వారా భారత సైన్యం గట్టి ఎదురుదెబ్బ తీసిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఇరుదేశాల సైన్యాల మధ్య కాల్పులు కొనసాగుతుండడం, ఆ కాల్పుల్లో పాలువురు చనిపోవడం తెలిసిందే.
శత్రువుపై మొదట కాల్పులుజరపవద్దని, అయితే శత్రువు తమపై కాల్పులు జరిపితే మాథ్రం తూటాలను లెక్కపెట్టుకోవద్దని కూడా సరిహద్దులను కాపలా కాస్తున్న భద్రతా దళాలకు రాజ్‌నాథ్ ఇంతకు ముందు సలహా ఇచ్చారు. కాగా, పాక్ సైన్యం పదే పదే కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడవడం గురించి విలేఖరులు అడిగిన ప్రశ్నలకు రాజ్‌నాథ్ సమాధానమిస్తూ, మన జవాన్లు వాటికి దీటుగా సమాధానమిస్తున్నారని చెప్పారు. గూఢచర్యానికి పాల్పడిన పాకిస్తాన్ హైకమిషన్ ఉద్యోగిని అదుపులోకి తీసుకోవడం గురించి అడగ్గా, ప్రభుత్వం దీనిపై అవసరమైన చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ రెండేళ్ల క్రితం లడఖ్‌లోని చుమార్ వద్ద భారత భూభాగంలోకి చొచ్చుకు రావడానికి చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ చేసిన ప్రయత్నాలను ధైర్యంగా అడ్డుకున్న కొంతమంది ఐడిబిపి జవాన్లను సత్కరించారు. భారత సైనికుల నిరంతర నిఘా, ధైర్య సాహసాల కారణంగా ప్రపంచంలో ఏ దేశం కూడా మన దేశంపై కనె్నత్తి చూడలేదని, వీరిని తాను చూసిన ప్రతిసారి కూడా దేశం వీరి చేతిలో సురక్షితంగా ఉందని గర్విస్తుంటానని హోం మంత్రి అన్నారు.
జవాన్ల ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని ఆయన అంటూ, దీనికోసం అనేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పా రు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ జవాన్లకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.
chitram...
శుక్రవారం నోయడాలో జరిగిన ఐటిబిపి 55వ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్