జాతీయ వార్తలు

ఐక్యతే మహాశక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 31: భారత దేశం మరింత శక్తిమంతం కావాలంటే దేశమంతా సమైక్యంగా ఉండటం వల్లనే సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. భారత మొట్టమొదటి హోం మంత్రి ఉక్కుమనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి సందర్భంగా సోమవారం జరిగిన ఏక్‌తాదివస్ కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. ‘మనం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రయాణిస్తున్నప్పుడు మనకు ఎలాంటి వీసాలు, పర్మిట్లు అవసరం లేదు. దారిలో వచ్చే ఏ రాష్ట్రంలోనూ మనం ఎలాంటి పన్ను చెల్లించం. దేశమంతా ఇంత ఐక్యంగా ఉండటానికి కారకుడు ఒకే ఒక్కడు సర్దార్ పటేల్. దేశంలోని అన్ని రాష్ట్రాలను తన రాజకీయ నిబద్ధతతో, రాజనీతితో ఏకం చేసిన మహామనిషి సర్దార్ పటేల్’’ అని మోదీ అన్నారు. ఈ సందర్భంగా ఐక్యతా పరుగును ఆయన ప్రారంభించారు. మనం మరింత శక్తిమంతం కావాలంటే దేశమంతటా కులం, జాతి, గ్రామం, నగరం అన్న వివక్షలేవీ లేకుండా సమైక్యం కావటం వల్లనే అది సాధ్యమవుతుందని మోదీ వ్యాఖ్యానించారు. సమాజాన్ని విభజించే శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. దేశరాజధానిలో డిజిటల్ మ్యూజియంను సర్దార్ పటేల్ స్మృత్యర్థం జాతికి అంకితం చేస్తున్నానని ఆయన మోదీ చెప్పారు. ‘‘ఐక్యతా విగ్రహాన్ని 40-50 సంవత్సరాలకు పూర్వమే నిర్మించి ఉండాల్సింది. చరిత్ర మనల్ని కచ్చితంగా అడుగుతుంది గతంలోనే ఎందుకు నిర్మించలేదని’’ అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ దేశానికి ఇప్పుడు మరింతమంది సర్దార్ పటేళ్ల అవసరం ఉందని, పటేల్‌లోని లక్షణాలన్నీ ప్రధాని మోదీలో కనిపిస్తున్నాయని అన్నారు. ప్రముఖ వెయిట్‌లిఫ్టర్ ఎన్.కుంజరాణిదేవి, రియో పారాలింపిక్స్ స్వర్ణ పతక విజేత దేవేంద్ర ఝజారియాతో కలిసి మోదీ ‘రన్ ఫర్ యూనిటీ’ని ప్రారంభించారు.

చిత్రం.. ఏక్‌తా దివస్ సభలో మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ