జాతీయ వార్తలు

సిమి ఎన్‌కౌంటర్‌పై రాజకీయాలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 1: దేశంలో విచ్ఛిన్నకర కార్యకలాపాలకు పాల్పడుతున్న సిమి కార్యకర్తలు ఎన్‌కౌంటర్‌లో చనిపోతే దాన్నీ కొందరు రాజకీయం చేస్తున్నారని కేంద్ర సమాచార ప్రసార, పట్టణాభివృద్ధి మంత్రి ఎం వెంకయ్యనాయుడు దుయ్యబట్టారు. ఈ ఘటనకు మతంరంగు పూయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని మంగళవారం ఇక్కడ విమర్శించారు. ‘సిమి కార్యకర్తల మరణాలపై పలువురు పలు రకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. దేశ ప్రజయోజనాల దృష్ట్యా ఇదెంత మాత్రం సమర్థనీయం కాదు’ అని ఆయన అన్నారు. ప్రతిపక్షాలకు దేశ ప్రయోజనాలు, భద్రత విషయాలు పట్టవని, ప్రతిదాన్నీ రాజకీయం చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆయన చెప్పారు. భద్రతాదళాలపై విమర్శలు చేయడం ఫ్యాషన్‌గా మారిపోయిందని విపక్షాలనుద్దేశించి వెంకయ్య విరుచుకుపడ్డారు. ‘మతం అంటే ఏమిటీ? నాలుగైదు రోజుల క్రితం ఏఓబి సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 30 మంది మావోయిస్టులు చనిపోయారు. దాని గురించి ఏవరూ మాట్లాడరు. అక్కడ మతం, ప్రాంతం గుర్తుకురావు’ అని మంత్రి నిలదీశారు. ‘్భపాల్‌లో సిమి కార్యకర్తలపై జరిగిన కాల్పులకు మాత్రం మతం అంటగడతారు. ఇవి ముమ్మాటికీ దిగజారుడు రాజకీయాలే’ అని ఆయన పేర్కొన్నారు.
దేశ ప్రయోజనాలు, భద్రత విషయంలో రాజకీయాలు చేయొద్దని అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నానని వెంకయ్య తెలిపారు. ఉగ్రవాదం, ఉగ్రవాద చర్యలకు మతంతో సంబంధం లేదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. జమ్మూకాశ్మీర్ విషయంలోనూ కొందరు చేస్తున్న ప్రకటనలు భద్రతా దళాల ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీసేవిగా ఉంటున్నాయని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. భోపాల్ సెంట్రల్ జైల్‌నుంచి తప్పించుకుపోతూ నగర శివార్లలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఎనిమిది మంది సిమి ఉగ్రవాదులు మృతిచెందిన విషయం తెలిసిందే.