జాతీయ వార్తలు

బాలూ ప్రతిభకు పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 1: ప్రఖ్యాత సినీ నేపథ్య గాయకుడు ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యంను ఈ శతాబ్దపు పురస్కారంతో గౌరవించనున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు మంగళవారం ప్రకటించారు. గోవాలో జరుగనున్న 47వ అంతర్జాతీయ సినీ వేడుకల్లో ఈ అవార్డును బాలసుబ్రహ్మణ్యంకు అందజేస్తామని ఆయన తెలిపారు. ‘‘బాలసుబ్రహ్మణ్యం ప్రతిభకు ఈ పురస్కారం లభిస్తోంది. ఇది అవార్డే కాని రివార్డు కాదు. దాదాపు అయిదు దశాబ్దాలుగా సినిమా రంగంలో పని చేస్తున్నారు. 40వేలకు పైగా పాటలు పాడారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అద్భుతమైన పాటలను అందించారు. ఆయనది మధురమైన గాత్రం. కష్టించే మనస్తత్వం’’ అని వెంకయ్యనాయుడు అన్నారు. 1970వ దశకంలో సినీరంగంలో ప్రవేశించిన బాలు ఆరుసార్లు జాతీయ అవార్డును అందుకున్నారు. అత్యధిక పాటలు పాడిన గాయకుడిగా గిన్నిస్ రికార్డును సృష్టించారు. పద్మశ్రీ, పద్మభూషణ్ పౌర పురస్కారాలను అందుకున్నారు. 90వ దశకంలో సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్‌కు సూపర్‌హిట్ పాటల్ని పాడారు.

ఢిల్లీలో మంగళవారం అంతర్జాతీయ ఫిలిమ్ ఫెస్టివల్‌కు సంబంధించిన పోస్టర్లను విడుదల చేస్తున్న కేంద్ర మంత్రులు రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, వెంకయ్యనాయుడు