జాతీయ వార్తలు

కాలం చెల్లిన చట్టాల రద్దులో ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) బిల్లుకు రాజ్యసభలో ఆమోదముద్ర వేయించుకోవడంతో పాటు కాలం చెల్లిన పలు చట్టాలను రద్దు చేయాలని ఆలోచిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. దేశంలో కాలం చెల్లిన వెయ్యికి పైగా చట్టాలను రద్దు చేసేందుకు ఉద్దేశించిన రెండు బిల్లులకు శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ ఆమోదం లభించకపోవడమే ఇందుకు కారణం. కాలం చెల్లిన 125 చట్టాలను రద్దు చేసేందుకు ప్రతిపాదించిన రెండు బిల్లులను పార్లమెంట్ ఆమోదించినప్పటికీ మొత్తం 1053 చట్టాల రద్దుకు ఉద్దేశించిన మరో రెండు బిల్లులు రాజ్యసభలో బడ్జెట్ సమావేశాల నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. శీతాకాల సమావేశాల సందర్భంగా ఎగువ సభలో నిత్యం గందరగోళం కొనసాగడంతో ఈ రెండు బిల్లులు కనీసం పరిశీలనకు కూడా రాలేదు. దీంతో ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం ఈ రెండు బిల్లులను తాజాగా ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. దేశంలో కాలం చెల్లిన చట్టాలను ప్రభుత్వం రోజుకు ఒకటి చొప్పున రద్దు చేయగలిగినా తాను ఎంతగానో సంతోషిస్తానని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వం ప్రతిపాదించిన రెండు బిల్లులో ఒకటి 295 చట్టాలను రద్దు చేసేందుకు ఉద్దేశించినది కాగా, కాలానుగుణ్యత కోల్పోయి చట్టాల పుస్తకంలో కొనసాగుతున్న రైల్వేల (అనుబంధ పద్దుల) చట్టం సహా 758 చట్టాల రద్దుకు మరో బిల్లు ఉద్దేశించబడినది.