జాతీయ వార్తలు

మరోసారి లక్షిత దాడులు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 1: కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించటంతోపాటు పౌరులపై బాంబులు కురిపిస్తున్న పాకిస్తాన్‌కు మరోసారి బుద్ధి చెప్పాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఉగ్రవాదులను మన దేశంలోకి పంపించి దాడులు చేయించటంతోపాటు సరిహద్దుకు ఆవలి వైపు నుండి ఎడతెరిపి లేకుండా కాల్పులు జరుపుతూ పౌరుల ప్రాణాలకు ముప్పు తెస్తున్న పాకిస్తాన్ సైన్యానికి బుద్ధి చెప్పే విషయం ఎన్‌డిఏ ప్రభుత్వం పరిశీలనలో ఉంది. ఉరీ సైనిక శిబిరంపై ఇస్లామిక్ ఉగ్రవాదులు దాడి జరిపి 19మంది సైనికులను హతమార్చినందుకు ప్రతీకారంగా ఆక్రమిత కాశ్మీర్‌లో భారత దళాలు లక్షితదాడి జరపటం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ కూడా ఇలాంటి దాడి చేయవచ్చునని అంచనా వేశారు. పాకిస్తాన్ సైన్యం సర్జికల్ దాడులకు ప్రతీకారంగా వెంటనే ప్రతి దాడికి దిగకుండా తమ పాత పద్ధతిలో సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచటంతోపాటు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ బాంబుల వర్షం కురిపిస్తోంది. సర్జికల్ దాడులకు ప్రతీకారంగా ప్రతి దాడులకు దిగితే గట్టిగా బుద్ధి చెప్పాలనుకున్న ఎన్‌డిఏ ప్రభుత్వానికి పాకిస్తాన్ నిరంతరం జరుపుతున్న కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన వ్యూహం ఇరకాటంలో పడవేసింది. పాకిస్తాన్ ప్రోద్బలం మేరకు ఇస్లామిక్ ఉగ్రవాదులు జమ్ముకాశ్మీర్‌లోని పాఠశాలలకు నిప్పుపెట్టడం కూడా ఎన్‌డిఏ ప్రభుత్వానికి మింగుడు పడటం లేదు. పాకిస్తాన్ రేంజర్లు మర తుపాకులు, 80 ఎంఎం, 120 ఎంఎం మోర్టార్లతో కురిపిస్తున్న బాంబుల మూలంగా ఇంతవరకు పదిహేనుమంది పౌరులు మరణించగా దాదాపు యాభైమంది వరకు గాయపడ్డారు. వందలాది మంది తమ గ్రామాలు విడిచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లవలసి వచ్చింది. పాకిస్తాన్ రేంజర్ల కాల్పుల మూలంగా మంగళవారం ఏడుగురు పౌరులు మరణించగా మరో పదిమంది గాయపడ్డారు. మరణించిన వారిలో ఇద్దరు చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పేందుకు మరోసారి లక్షిత దాడుల లాంటివి చేస్తే ఎలా ఉంటుందనేది ఎన్‌డిఏ ప్రభుత్వం పరిశీలిస్తోంది.
అయితే, అక్రమిత కాశ్మీర్‌లోని పౌర ప్రాంతాలపై బాంబులు కురిపించటం ఎన్‌డిఏ ప్రభుత్వానికి ఎంతమాత్రం ఇష్టం లేదని, రేంజర్ల దాడులకు పౌరులను బలిచేసే బదులు వారినే దండించటం మంచిదని ఎన్‌డిఏ ప్రభుత్వంతో పాటు భద్రతా దళాలు కూడా భావిస్తున్నట్లు తెలిసింది. అందుకే ఈసారి సర్జికల్ దాడులు జరపవలసి వస్తే వాటిని రేంజర్లపై కేంద్రీకరించే అవకాశాలున్నాయని ప్రభుత్వాధికారులు చెబుతున్నారు.
chitram...
పాకిస్తాన్ రేంజర్లు మంగళవారం జనావాసాలపై జరిపిన కాల్పుల్లో గాయపడిన
ఒక చిన్నారిని జమ్మూలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చినప్పటి దృశ్యం