జాతీయ వార్తలు

వీరిద్దరూ ‘రా’ ఏజెంట్లే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 2: గూఢచర్యం ఆరోపణలపై భారత్‌లోని తమ హై కమిషన్ నుంచి నలుగురు అధికారులను వెనక్కి తీసుకున్న పాకిస్తాన్ ప్రతి చర్యగా ఇద్దరు భారత దౌత్యవేత్తల్ని బహిష్కరించింది. ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌లో పనిచేస్తున్న ఆర్.అగ్నిహోత్రి, బల్బీర్ సింగ్‌లు గూఢచర్యానికి పాల్పడుతున్నందునే వారిని బహిష్కరిస్తున్నట్టు పాక్ ప్రకటించింది. వీరిద్దరూ దౌత్యవేత్తలుగా వచ్చిన భారత ‘రా’ ఏజెంట్లుగా పాకిస్తాన్ పరిగణిస్తున్నట్టుగా కథనాలు వెలువడ్డాయి. అంతే కాదు వీరిద్దరూ పాక్ విచ్ఛిన్నమే లక్ష్యంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారని, అందుకు నిధులూ సమకూరుస్తున్నారని పాక్ తీవ్ర ఆరోపణలు చేసినట్టుగా పాకిస్తాన్ టుడే పేర్కొంది. ఇటీవల తాము బహిష్కరించిన మరో భారత దౌత్యాధికారి సూర్జిత్ సింగ్‌కు కూడా ఈ కార్యకలాపాలతో సంబంధం ఉందని తెలిపింది. కాగా, భారత్‌లో గూఢచర్య ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరుగురు పాక్ దౌత్యాధికారుల్ని అక్కడి ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ప్రస్తుతం అన్ని విధాలుగా విషమించిన పరిస్థితుల్లో తమ అధికారులు భారత్‌లో పనిచేసే అవకాశం ఎంత మాత్రం లేనందునే వారిని వెనక్కి పిలిపిస్తున్నట్టు పాక్ తెలిపింది.