జాతీయ వార్తలు

నిబంధనలకు విరుద్ధమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 2: నూతన రాజధాని అమరావతి కొండవీటి వాగు పరీవాహక ప్రాంతాలు, వరద ముంపుప్రాంతాలలో ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాలు నిబంధనలను ఉల్లంఘించడమేనని గ్రీన్ ట్రిబ్యునల్ ముందు పిటిషనర్ తరఫున్యాయవాది వాదించారు. ఏపి నూతన రాజధాని అమరావతి నిర్మాణంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటి)లోదాఖలైన పిటిషన్ల విచారణను ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ స్వతంత్రకుమార్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం కూడా కొనసాగించింది.
వరుసగా రెండోరోజు పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది సంజయ్ పారిఖ్ వాదనలు వినిపించారు. అమరావతి నిర్మాణానికిచ్చిన పర్యావరణ అనుమతులపై నదులు,వాగుల దిశను ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చకూడదని ఆయన వాదించారు. రాష్ట్రంలో సహజ వనరులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని, కాని ప్రభుత్వాలే నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని ఆయన ట్రిబ్యునల్ దృష్టికి తీసుకొచ్చారు. ఉద్ధృతంగా ప్రవహించే కొండవీటివాగు పరీవాహక ప్రాంతంలో నిర్మాణం చేపట్టడం ప్రమాదకరమని, కృష్ణానది చుట్టూ ఉన్న 13 ద్వీపాల్లో నిర్మాణాలు చేపట్టరాదని వాదించారు. అలాగే నదీ పరీవాహక ప్రాంతాలలో, ముంపు ప్రాంతాల్లో కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టరాదని చట్టాలున్నా వాటిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సంజయ్ పారిఖ్ వాదించారు. వాదనలు కొనసాగించేందుకు మరికొంత సమయం కావాలని ఆయన ట్రిబ్యునల్‌ను అభ్యర్థించగా, అంగీకరించిన ఎన్జీటి విచారణను గురువారానికి వాయిదా వేసింది. గురువారం కూడా పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు కొనసాగించనున్నారు.