జాతీయ వార్తలు

కోర్టు ధిక్కరణపై కఠినంగా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 2: న్యాయ వ్యవస్థ ఔన్నత్యాన్ని కాపాడుకునేందుకు కోర్టు ధిక్కార అధికారాన్ని వినియోగించుకోవాలని, ఉద్దేశపూర్వకంగా ఇందుకు పాల్పడేవారి పట్ల కఠినంగానే వ్యవహరించాలని సర్వోన్నత న్యాయస్థానం బుధవారం కోర్టులకు స్పష్టం చేసింది. ‘్భవస్వేచ్ఛను ప్రాధమిక హక్కుగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 చెబుతోంది. దానికి కోర్టు ధిక్కారణ రూపంలో కొన్ని పరిమితులు ఉన్నాయి. కాబట్టే న్యాయవ్యవస్థ గొప్పతనాన్ని కాపాడుకునేందుకు దాన్ని వినియోగించుకోవాల్సిందే’ అని జస్టిస్ ఎఆర్ దవే, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావుతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఉద్దేశపూర్వకంగా కోర్టు ధిక్కరణకు పాల్పడితే కఠినంగా ఉండాలని న్యాయస్థానాలకు ధర్మాసనం తెలిపింది. కోర్టు ధిక్కారణ కేసులో రాజస్థాన్ హైకోర్టు తీర్పును ధర్మాసనం సమర్థించింది. 2001లో కార్మిక నాయకుడి హత్య కేసుకు సంబంధించి నలుగురు సిపిఎం కార్యకర్తలు న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో వారికి రాజస్థాన్ హైకోర్టు రెండు నెలల జైలుశిక్ష విధించింది. 2000 డిసెంబర్ 18న శ్రీగంగానగర్ జిల్లాలో కార్మిక నాయకుడు హత్యకు గురయ్యాడు. ఈ కేసులో నిందితులకు 2001 ఫిబ్రవరి 23న హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని వ్యతిరేకిస్తూ నలుగురు సిపిఎం కార్యకర్తలు న్యాయవ్యవస్థను అవమానించేలా ప్రకటన చేశారు. సిపిఎం నేతల ప్రకటన దినపత్రికల్లో వచ్చాయి. దీన్ని తీవ్రంగా పరిగణించిన రాజస్థాన్ హైకోర్టు నలుగురు నేతలకు కోర్టు ధిక్కారణ కింద జైలు శిక్ష విధించింది.

ఆప్ ఎమ్మెల్యేలకు
ఇసి నోటీసులు
న్యూఢిల్లీ, నవంబర్ 2: ఎన్నికల సంఘం బుధవారం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి చెందిన 27 మంది ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. లాభదాయక పదవులు నిర్వహిస్తున్న ఈ 27 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ దాఖలయిన పిటిషన్‌కు స్పందించిన ఎన్నికల సంఘం ఈ నోటీసులు జారీ చేసింది. దీంతో ఆప్ మరో న్యాయ పోరాటంలో చిక్కుకున్నట్లు అయింది. పార్లమెంటరీ కార్యదర్శులుగా పదవులు నిర్వహిస్తున్న 21 మంది ఆప్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ గతంలో దాఖలయిన పిటిషన్‌పై తుది వాదనలు ఈ నెల 15న మొదలవుతాయని కూడా ఎన్నికల సంఘం వివరించింది. సదరు 21 మంది ఎమ్మెల్యేలతోపాటు పిటిషనర్‌కు జారీ చేసిన నోటీసుల్లో ఎన్నికల సంఘం తుది వాదనలు ఈ నెల 15న మధ్యాహ్నం ప్రారంభం అవుతాయని పేర్కొంది. కాగా, తాజా పిటిషన్ జూన్‌లో దాఖలు చేయగా, రాష్టప్రతి భవన్ దానిని ఎన్నికల సంఘానికి పంపించింది.
లాభదాయక పదవులు నిర్వహిస్తున్నందున ఈ 27 మంది శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయవలసిందిగా ఆ పిటిషన్‌లో కోరారు. ఈ 27 మందిలో ఏడుగురు పార్లమెంటరీ కార్యదర్శి పదవులు నిర్వహిస్తున్నందున వారి అనర్హతకు సంబంధించిన పిటిషన్‌ను ఎన్నికల సంఘం ఇదివరకే స్వీకరించి, తదనంతర చర్యలు తీసుకుంటోంది.