జాతీయ వార్తలు

పాక్ కాల్పులను తిప్పికొట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 2: భారత్-పాక్ సరిహద్దుల్లో ఓ వైపు ఉద్రిక్తతలు పెరిగి పోతుండగా, మరోవైపు పాక్ మోర్టార్ దాడులను తిప్పి కొట్టడానికి, దేశ గౌరవాన్ని కాపాడడానికి ఎన్డీఏ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. జమ్మూ ప్రాంతంలో సరిహద్దు ఆవలి వైపునుంచి పాక్ సైన్యాల కాల్పులు నిరంతరాయంగా కొనసాగడం గురించి బుధవారం విలేఖరులు అడగ్గా, దేశ గౌరవ ప్రతిష్ఠలను కాపాడడానికి అవసరమైన చర్యలన్నీ తమ ప్రభుత్వం తీసుకుంటుందని రాజ్‌నాథ్ చెప్పారు. పౌర నివాస ప్రాంతాలపై పాక్ జరుపుతున్న శతఘ్ని దాడులను తిప్పి కొట్టడానికి అనుసరించబోయే వ్యూహం గురించి అడగ్గా, సరిహద్దు వెంబడి నివసించే పౌరుల భద్రత గురించి తాను ఇప్పటికే కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీతో మాట్లాడినట్లు రాజ్‌నాథ్ చెప్పారు. ‘వ్యూహం అంటే వ్యూహమే, దాన్ని వెల్లడించలేము’ అని కూడా ఆయన చెప్పారు. పాక్ కాల్పులను భారత్ ఎలా తిప్పి కొడుతోందని విలేఖరులు అడగ్గా, ‘ఆ విషయాన్ని పొరుగు దేశానే్న (పాక్) అడగండి’ అని ఆయన అన్నారు. సరిహద్దుల్లో ఉద్రిక్తత పెరిగిపోతున్న దృష్ట్యా ఉద్రిక్తతలను తగ్గించడానికి బిఎస్‌ఎఫ్, పాక్ రేంజర్స్ మధ్య హాట్‌లైన్‌ను పునరుద్ధరించే అవకాశముందా అని అడగ్గా, ‘మొదట అందుకు పాక్‌ను సిద్ధం కానివ్వండి’ అని రాజ్‌నాథ్ అన్నారు. గత సెప్టెంబర్ 27న మన సైన్యం పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాదుల లాంచ్‌ప్యాడ్‌లపై మెరపుదాడులు చేసినప్పటినుంచి జమ్మూలోని నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్ సైన్యం జరుపుతున్న కాల్పులు, శతఘ్ని దాడుల్లో 12 మంది పౌరులు సహా 18 మంది మృతిచెందగా, 80 మందికి పైగా గాయపడ్డారు.