జాతీయ వార్తలు

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడుల పట్ల సుష్మ ఆరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 6: బంగ్లాదేశ్‌లో హిందువులపైన, హిందూ దేవాలయాలపైన తాజాగా దాడులు జరిగిన దృష్ట్యా ఆ దేశంలో హిందువుల భద్రత పట్ల భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళనను ఆ దేశ ప్రధాని షేక్ హసీనాకు తెలియజేయాలని ఢాకాలోని భారత హైకమిషనర్‌ను విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఆదేశించారు. ‘బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాను కలిసి ఆ దేశంలో హిందువుల భద్రత పట్ల మన తీవ్ర ఆందోళనను తెలియజేయాలని ఢాకాలోని భారత హైకమిషనర్‌ను ఆదేశించాను’ అని సుష్మాస్వరాజ్ ఆదివారం ఒక ట్వీట్‌లో తెలిపారు.
శుక్రవారం రాత్రి బ్రహ్మన్‌బరియా జిల్లా నాసిర్‌నగర్‌లో కొంతమంది గుర్తు తెలియని దుండగులు రెండూ హిందూ దేవాలయాలను ధ్వంసం చేయడంతో పాటు హిందువులకుచెందిన ఆరు ఇళ్లకు నిప్పు పెట్టారు. గతంలోను ఫేస్‌బుక్‌లో ఇస్లాం మతాన్ని అవమానపరిచే విధంగా ఉండే వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగినప్పుడు ఇదే జిల్లాలో 15 హిందూ దేవాలయాలను ధ్వంసం చేయడమే కాకుండా హిందువులకు చెందిన 20కి పైగా ఇళ్లను తగులబెట్టారు. తాజా దాడులకు సంబంధించి 33 మందిని పోలీసులు శనివారం రాత్రి అరెస్టు చేశారు.
ఇంతకు ముందు కూడా బంగ్లాదేశ్‌లో హిందువుల భద్రత అంశాన్ని మన దేశం అక్కడి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. మైనారిటీలను లక్ష్యంగా చేసుకునే ఈ దాడులు చేసినట్లు బంగ్లాదేశ్ జాతీయ మానవ హక్కుల కమిషన్ పేర్కొంటూ, దీనిపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.