జాతీయ వార్తలు

ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్‌లో అక్రమాలు నిజమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డిడిసిఎ)లో అక్రమాలపై దర్యాప్తు జరిపిన ఢిల్లీ ప్రభుత్వ కమిటీ తన నివేదికలో ఎక్కడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పేరును ప్రస్తావించలేదు. అరుణ్ జైట్లీ గతంలో 13 ఏళ్ల పాటు (2013 వరకు) డిడిసిఎ అధ్యక్షునిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో డిడిసిఎలో అనేక అక్రమాలు జరిగినట్లు ప్రతిపక్షాల నుంచి జైట్లీ ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో దర్యాప్తు కమిటీ నివేదికలో ఆయన పేరు లేకపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఆరోపణలపై ఢిల్లీ ప్రభుత్వ విజిలెన్స్ విభాగ ప్రిన్సిపల్ సెక్రటరీ చేతన్ సంఘీ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ దర్యాప్తు జరిపి 237 పేజీలతో కూడిన నివేదికను రూపొందించింది. ఢిల్లీ, డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్‌లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన విషయాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) దృష్టిలో ఉంచుకుని డిడిసిఎని తక్షణమే సస్పెండ్ చేయాలని ఈ కమిటీ తన నివేదికలో సిఫారసు చేసింది. ఈ నివేదికలో ఎక్కడా అరుణ్ జైట్లీ పేరును ప్రస్తావించకపోయినప్పటికీ అధికారుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా కార్పొరేట్ బాక్సులను నిర్మించడం, వయసు ధ్రువీకరణ పత్రాల్లో ఫోర్జరీలుసహా డిడిసిఎలో పలు అక్రమాలు జరిగాయని ఈ కమిటీ స్పష్టం చేసింది. డిడిసిఎలో అక్రమాలను పట్టించుకోనందుకు బిసిసిఐపై ఈ కమిటీ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతో పాటు ఢిల్లీ, డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్‌ను ప్రక్షాళన చేసేందుకు జస్టిస్ ఆర్‌ఎం.లోధా కమిటీ సలహాకోసం సుప్రీం కోర్టును ఆశ్రయించాలని సిఫారసు చేసింది. సుప్రీం కోర్టు నియమించిన జస్టిస్ లోధా కమిటీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) బెట్టింగ్ కుంభకోణంపై దర్యాప్తు జరిపి ప్రస్తుతం బిసిసిఐని ప్రక్షాళన చేసేందుకు కృషి చేస్తున్న విషయం తెలిసిందే. 1999 నుంచి 2013 వరకు డిడిసిఎ అధ్యక్షునిగా వ్యవహరించిన అరుణ్ జైట్లీ తాను అమాయకుడినని చెప్పుకుంటున్నప్పటికీ ఆయన హయాంలో అనేక అక్రమాలు జరిగాయని విపక్షాలు దుమ్మెతి పోస్తున్నాయి. ఈ ఆరోపణలపై యుపిఎ ప్రభుత్వ హయాంలో దర్యాప్తు జరిపిన ఎస్‌ఎఫ్‌ఐఓ (సీరియర్ ఫ్రాడ్ ఇనె్వస్టిగేషన్ ఆఫీస్) కూడా జైట్లీ అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించలేదు. అయితే డిడిసిఎకి సంబంధించిన ఫైళ్లను తనిఖీ చేసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) జైట్లీ కార్యాలయంలో సోదాలు నిర్వహించిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.