జాతీయ వార్తలు

15 రోజుల్లో జయ డిశ్చార్జి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, నవంబర్ 8: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితి బాగా మెరుగైంది. అమ్మ అపోలో ఆసుపత్రి నుంచి వారం పది రోజుల్లో డిశ్చార్జి అవుతారని అన్నాడిఎంకె అధికార ప్రతినిధి సి పొన్నియన్ మంగళవారం వెల్లడించారు.‘జయకు ఫిజియోథెరపీ జరుగుతోంది. ఆమె చక్కగా స్పందిస్తున్నారు. రెండు వారాల్లోపే అమ్మ డిశ్చార్జి అవుతుంది’అని ఆయన చెప్పారు. జయలలితకు వెంటిలేటర్ తొలగించినా శ్వాస తీసుకోగలుగుతున్నానని తెలిపారు. ద్రవరూప ఆహారం తీసుకుంటున్నానని పొన్నియన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఐసియులోనే ఉన్న జయలలిత కూర్చోగలుతున్నారని ఆయన వివరించారు. ఐసియు నుంచి ప్రైవేటు రూమ్‌కు మార్చే విషయంలో వైద్యులు తుది నిర్ణయం తీసుకోవల్సి ఉంది. అన్నాడిఎంకె అధినేత్రి పూర్తిగా కోలుకున్నారని అపోలో ఆసుపత్రి చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి చేసిన ప్రకటనపై పొన్నియన్ మాట్లాడుతూ‘అమ్మ సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి రావాలని అందరూ కోరుకుంటున్నారు’అని బదులిచ్చారు. పార్టీ నాయకులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారని, ఇంటికి వచ్చాక ఎలాంటి ఆరోగ్య సమస్యలు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉండాలని అందుకే పూర్తిగా నయమయ్యాకే డిశ్చార్జి అవ్వాలని కోరుకుంటున్నారు. జయలలిత వద్దకు డాక్టర్లు, ఫిజియోథెరపిస్టులు, నర్సులను తప్ప ఎవరినీ అనుమతించడం లేదని పొన్నియన్ పేర్కొన్నారు.