జాతీయ వార్తలు

ఆచూకీ దొరకని స్టంట్‌మన్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, నవంబర్ 8: కర్నాటకలోని తిప్పగొండనహల్లి రిజర్వాయర్‌లో మునిగిపోయిన సినీనటులు అనిల్, ఉదయ్ ఆచూకీ ఇంతవరకూ లభించలేదు. ఈ ఘటనకు సంబంధించి ఆ సినిమా నిర్మాత, డైరెక్టర్, స్టంట్ డైరెక్టర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం ‘మస్తిగుడి’ సినిమా షూటింగ్ సమయంలో నిర్మాతలు తగిన జాగ్రత్తలు తీసుకోలేదని బెంగళూరు నీటి సరఫరా, సివరేజ్ బోర్డు అధికారులు ఆరోపించారు. సినిమా క్లైమాక్స్‌కు సంబంధించిన సీన్లను షూటింగ్ చేస్తున్న సమయంలో హెలికాప్టర్ నుంచి రిజర్వాయర్‌లోకి దూకిన స్టంట్‌మన్ అనిల్, ఉదయ్ నీటిలో మునిగిపోయిన విషయం తెలిసిందే. అయితే వీరిని బయటకు తీసుకువచ్చేందుకు ఒక మోటారు బోటు ఏర్పాటు చేసినప్పటికీ, అదే సమయంలో అది పనిచేయకపోవడంతో ఈతరాని ఇద్దరు నటులూ మునిగిపోయారు. అదే సమయంలో దూకిన హీరో దునియా విజయ్ మాత్రం ఈదుకుంటూ తనని తాను సంరక్షించుకున్నాడు. ఈ ముగ్గురికీ లైఫ్ జాకెట్లు లేవని, తగిన జాగ్రత్తలు ఏమాత్రం తీసుకోలేదని అయినప్పటికీ విజయ్ క్షేమంగా బయటపడ్డాడని పోలీసులు తెలిపారు. అనిల్, ఉదయ్ కోసం గాలిస్తున్నట్లు వారు తెలిపారు.