జాతీయ వార్తలు

ఇస్లామాబాద్‌లో భారత డిప్యూటీ హైకమిషనర్‌కు పాక్ సమన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, నవంబర్ 8: సరిహద్దుల్లో భారత్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘించిందని ఆరోపిస్తున్న పాకిస్తాన్ దీనిపై వివరణ కోరేందుకు మంగళవారం భారత డిప్యూటీ హైకమిషనర్‌ను తన విదేశాంగ శాఖ కార్యాలయానికి పిలిపించింది. అయితే పాకిస్తాన్ సైన్యాలే అధీన రేఖ వెంబడి ఎలాంటి కవ్వింపూ లేండానే కాల్పులు పాల్పడుతోందని, ఫలితంగా భారత సైనికులతో సహా పలువురు పౌరులు మృతి చెందారని భారత డిప్యూటీ కమిషనర్ ప్రత్యారోపణ చేశారు. గత రెండు వారాల్లో భారత డిప్యూటీ హైకమిషనర్ జెపి సింగ్‌ను పాక్ విదేశాంగ శాఖ కార్యాలయానికి పిలిపించడం ఇది అయిదోసారి. నికియాల్, జాండ్రాట్ సెక్టార్లలో భారత్ ఎలాంటి కవ్వింపూ లేండానే కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలు పాల్పడ్డంపై సింగ్‌ను పాక్ విదేశాంగ శాఖలో దక్షిణాసియా, సార్క్ దేశాల వ్యవహారాల డైరెక్టర్ జనరల్ డాక్టర్ మహమ్మద్ ఫైసల్ తమ కార్యాలయానికి పిలిచి తీవ్ర నిరసన తెలియజేసినట్లు విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కాల్పుల ఫలితంగా ఒక మహిళ చనిపోగా, అయిదేళ్ల బాలుడు సహా నలుగురు గాయపడినట్లు కూడా ఆ ప్రకటన తెలిపింది. కాగా, గత వారం పూంఛ్ జిల్లాలోని కృష్ణఘాటి, పూంఛ్ సెక్టార్లలో నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైనికులు జరిపిన కాల్పులపై భారత్ తీవ్ర అభ్యతరాన్ని సింగ్ పాక్‌కు తెలియజేశారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఆర్మీ జవాన్లు చనిపోగా, మరో అయిదుగురు గాయపడ్డ విషయం తెలిసిందే.
రెండు దేశాల మధ్య 2003 నాటి కాల్పుల విరమణ ఒప్పందాన్ని గౌరవించాలని, కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలపైన దర్యాప్తు జరిపించాలని, కాల్పుల విరమణ ఒప్పందాన్ని గౌరవించాలని, పౌర నివాస ప్రాంతాలపై కాల్పులు జరపడాన్ని ఆపివేయాలని భారత సైన్యాన్ని ఆదేశించాలని కూడా డైరెక్టర్ జనరల్ భారత్‌ను కోరినట్లు ఆ ప్రకటన తెలిపింది. కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలపై భారత డిప్యూటీ హైకమిషనర్ సింగ్‌ను పాక్ విదేశాంగ శాఖ కార్యాలయానికి గత నెల 25, 26, 28 తేదీల్లో, అలాగే ఈ నెల 1వ తేదీన పిలిపించడం జరిగింది.