జాతీయ వార్తలు

పాక్ కాల్పుల్లో జవాను మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ, నవంబర్ 8: కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘించి సరిహద్దుల్లోని భారత సైనిక స్థావరాలపైన, పౌర నివాస ప్రాంతాలపైన తరచూ కాల్పులు జరుపుతున్న పాక్ సైన్యానికి భారత్ మరోసారి గట్టిగా బుద్ధి చెప్పింది. మంగళవారం ఉదయం జమ్మూ, కాశ్మీర్‌లోని నౌషేరా సెక్టార్‌లోనియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ భారత సైనిక స్థావరాలపైన, నివాస ప్రాంతాలపై పెద్ద ఎత్తున మోర్టార్‌లతో గుళ్ల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో ఒక భారత జవాను వీర మరణం చెందాడు. దీంతో తీవ్రంగా స్పందించిన భారత సైన్యం ఎదురుకాల్పులకు దిగి పాక్ ఆర్మీ పోస్టులకు తీవ్ర నష్టం కలిగించింది. ఈ రోజు మధ్యాహ్నం 1.45 గంటలనుంచి పూంఛ్ జిల్లాలోని కృష్ణఘాటి సెక్టార్‌లో కూడాపాక్ సైన్యాలు ఎలాంటి కవ్వింపూ లేకుండానే కాల్పులు జరుపుతూ ఉందని రక్షణ శాఖ అధికారి ఒకరు చెప్పారు. పాక్ సైనికులు 120 ఎంఎం మోర్టార్లు, ఆటోమేటిక్ ఆయుధాలను ఉపయోగించారని కూడా ఆ అధికారి చెప్తూ, భారత సైన్యం వారికి దీటుగా సమాధానం ఇవ్వడం జరిగిందని తెలిపారు.
భారత సైన్యాలు గత నెల పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై మెరపు దాడులు జరిపినప్పటినుంచి పాక్ సైన్యాలు ఇప్పటివరకు వందకు పైగా కాల్పుల ఒప్పందం ఉల్లంఘనలకు పాల్పడింది.
ఈ నెల 1వ తేదీన పాక్ సైన్యాలు జమ్మూ, కాశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ వెంబడి పౌర నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున మోర్టార్ దాడులకు తెగబడ్డంతో నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు సహా ఎనిమిది మంది చనిపోగా, 22 మందికి పైగా గాయపడ్డం తెలిసిందే. పాక్ సైన్యాలు అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ వెంబడి జరిపిన కాల్పులు, శతఘ్ని దాడుల్లో ఇప్పటివరకు 12 మంది పౌరులు సహా మొత్తం 18 మంది చనిపోగా, 83 మందికి పైగా గాయపడ్డారు.
భారత పర్యటనలో వున్న బ్రిటిష్ ప్రధాని థెరిసా మె మంగళవారం నాడు బెంగళూరులోని ప్రసిద్ధ సోమేశ్వర ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె సంప్రదాయ చీరకట్టుతో ఆకట్టుకున్నారు.