జాతీయ వార్తలు

త్వరలో కొత్త రూ.1000 నోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కెట్లోకి 2000 నోటు నేటి నుంచి ఏటిఎంలలో రూ. 50 నోట్లు
బ్యాంకుల ముందు జనం బారులు డబ్బు తగలబెట్టుకుంటున్న నల్ల కుబేరులు

త్వరలో కొత్త వెయ్యి రూపాయల నోటును తీసుకురానున్నట్టు కేంద్రం ప్రకటించింది. అలాగే ఏటిఎంలలో శుక్రవారంనుంచీ 50 రూపాయల నోట్లను ఉంచనున్నట్టు ఆర్‌బిఐ తెలిపింది. కొత్తగా ప్రవేశపెట్టిన 2000 రూపాయల నోటు మార్కెట్లోకి వచ్చింది. దేశవ్యాప్తంగా అక్కడక్కడ
నల్ల కుబేరులు తమ డబ్బును తగులబెట్టుకున్న వైనం వెలుగుచూసింది.

న్యూఢిల్లీ, నవంబర్ 10: కొత్తగా ప్రవేశపెట్టిన 2 వేల రూపాయలు, అయిదు వందల రూపాయల నోట్లలో ఎలాంటి విశిష్టతలుంటాయి. జనం వాటిని ఎలా గుర్తు పట్టాలనే దానిపై రిజర్వ్ బ్యాంక్ గురువారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బిఐ) గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. అలాగే రద్దు చేసిన వెయ్యి రూపాయల నోటు స్థానంలో కొత్త నోటును త్వరలో ప్రవేశపెడతామని కూడా ఆర్‌బిఐ అధికారులు ప్రకటించారు. దేశంలో తొలిసారిగా ప్రవేశపెడుతున్న 2000 రూపాయల నోటు ఇప్పటివరకు వచ్చిన కరెన్సీ నోట్ల రంగుకు పూర్తి భిన్నంగా మెజెంటా రంగులో ఉంటుందని, దానిపై రిజర్వ్ బ్యాంక్ కొత్త గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకంతో పాటు ముద్రించిన సంవత్సరం 2016 కూడా ఉంటుందని ఆర్‌బిఐ ఆ వివరణలో తెలిపింది. నోటు ముందు వైపు మధ్యలో మహాత్మాగాంధీ బొమ్మ, వెనుక వైపున దేశంలో తొలిసారిగా జరిగిన గ్రహాంతర వ్యోమనౌక ప్రయోగానికి గుర్తుగా మంగళ్ యాన్ బొమ్మ ఉంటాయి. వీటికి తోడు నోటు, ముందు వెనుక వైపు కొన్ని అదనపు ఫీచర్లు కూడా ఉంటాయి. అంధులు సైతం సులభంగా గుర్తించడం కోసం మహాత్మాగాంధీ, అశోక స్తంభం బొమ్మలు కాస్త ఉబ్బెత్తుగా ఉంటాయి. వీటికి తోడు బ్లీడ్ లైన్స్, ఐడెంటిటీ మార్క్‌లు కూడా ఉంటాయి. అలాగే నోటుపై దీర్ఘచతురస్రాకారంలో 2000 అనే అంకె కాస్త ఉబ్బెత్తుగా ఉంటుంది. ఇక కొత్త 500 రూపాయల నోటు స్టోన్‌గ్రే రంగులో ఉండి వెనుకవైపున ఢిల్లీలోని చారిత్రక కట్టడమైన ఎర్రకోట బొమ్మ ఉంటుంది అని ఆర్‌బిఐ తెలిపింది. రద్దయిన వెయ్యి రూపాయల నోటు స్థానంలో కొత్త వెయ్యి రూపాయల నోటును కొత్త ఫీచర్లతో త్వరలోనే ప్రవేశపెట్టడం జరుగుతుందని ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ గురువారం ఇక్కడ ఎకనామిక్ ఎడిటర్ల సదస్సులో మాట్లాడుతూ చెప్పారు. ఇప్పుడున్న వంద, 50 రూపాయల నోట్లు కొనసాగుతాయని, ఈ నోట్లకు సంబంధించి కొత్త డిజైన్, సరికొత్త ఫీచర్లతో కూడిన కొత్త సిరీస్‌ను ఆర్‌బిఐ రాబోయే రోజుల్లో విడుదల చేస్తుందని కూడా ఆయన చెప్పారు. కాగా, శుక్రవారంనుంచి ఎటిఎంలలో 50 రూపాయల నోట్లనుకూడా ఉంచనున్నట్లు ఆర్‌బిఐ తెలిపింది.
ఆ నోట్లను పాక్ ముద్రించలేదు
కాగా, భారత్‌లో కొత్తగా ప్రవేశపెడుతున్న 500, వెయ్యి, 2000 రూపాయల నోట్లను పాకిస్తాన్ వాళ్లు ముద్రించలేని విధంగా రూపొందించినట్లు ఇంటెలిజన్స్ ఏజన్సీల అధికారులు అంటున్నారు. 2000, 500 రూపాయల కొత్త నోట్లలో ఉండే సెక్యూరిటీ ఫీచర్ల కారణంగా పాకిస్తాన్ వాటిని కాపీ కొట్టడం అసాధ్యమని వారు అంటున్నారు. రిసెర్చ్, అనాలసిస్ వింగ్ (రా), ఇంటెలిజన్స్ బ్యూరో(ఐబి), డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజన్స్ (డిఆర్‌ఐ)కు చెందిన అధికారులు గత ఆరు నెలలుగా ఈ ఫీచర్స్‌ను పరీక్షించినట్లు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
పాకిస్తాన్‌లోని పెషావర్‌లో నకిలీ భారతీయ కరెన్సీని ప్రింట్ చేయడం కోసమే ఒక ప్రత్యేక ముద్రణాలయం ఉందని, అయితే ఆ ముద్రణాలయంలో ఈ నోట్లను ముద్రించడం సాధ్యం కాదని వారు అభిప్రాయ పడ్డారు.
ఇక ఇప్పుడు పాత 500, వెయ్యి నోట్లను రద్దు చేసి కొత్త నోట్లను ప్రవేశపెట్టడంతో పాక్ నకిలీ కరెన్సీ దందాకు దాదాపుగా తెరపడినట్లేనని, ఈ ప్రెస్‌ను మూసేసుకోవలసిందేనని కూడా ప్రభుత్వ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.