జాతీయ వార్తలు

గంటల తరబడి క్యూలోనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/ అహ్మదాబాద్/ ముంబయి, నవంబర్ 12: కేంద్రం అకస్మాత్తుగా పెద్ద నోట్ల చలామణిని రద్దు చేయడం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకుల శాఖల వద్ద మూడో రోజు శనివారం కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు క్యూలైన్లలో నిలబడి తమ వద్ద ఉన్న పాత రూ.500, 1000 నోట్లను మార్చుకోవడానికి లేదా వాటిని తమ ఖాతాల్లో జమ చేసుకోవడానికి అష్టకష్టాలు పడ్డారు. నిత్యావసర వస్తువుల కొనుగోలుకు తమ ఖాతాల్లో ఉన్న నగదును తీసుకుందామనుకున్నా ఎటిఎంలలో నగదు లేదు. నగదు లేక అనేక ప్రాంతాల్లో ఎటిఎంలు మూతపడ్డాయి. పెద్ద నోట్ల రద్దును స్వయంగా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ స్వంత రాష్ట్రం గుజరాత్‌లో శనివారం ప్రజలు అనేకచోట్ల బ్యాంకుల అధికారులతో ఘర్షణ పడ్డారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీచార్జి చేయడంతోపాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో ఎటిఎంలు ఇంకా మూసివేసే ఉన్నాయని, బ్యాంకుల్లో రద్దయిన నోట్లను ఇస్తే అధికారులు వాటికి బదులుగా నాణేలను, చిన్న నోట్లను ఇస్తున్నారని అనేకచోట్ల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరూ పాత పెద్ద నోట్లను స్వీకరించడం లేదని చివరకు ఆసుపత్రుల్లో కూడా తీసుకోవడం లేదని, దీంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అహ్మదాబాద్‌లో పాత నోట్లను మార్చుకోవడానికి బ్యాంకుకు వచ్చిన రమేశ్ అగర్వాల్ అనే వ్యక్తి తెలిపారు. తమ వద్ద కొత్త రూ.2000 నోట్లు లేవని, కేవలం నాణేలు మాత్రమే ఉన్నాయని అధికారులు చెబుతున్నారని బిపిన్ పటేల్ అనే వ్యక్తి చెప్పారు. బ్యాంకు అధికారులు తనకు రూ.4000 విలువ గల నాణేలు ఇచ్చారని, వాటిని మోసుకెళ్లడం చాలా కష్టంగా ఉందని ఆయన లబోదిబోమన్నారు. పెద్ద నోట్ల రద్దుతో చేతిలో డబ్బు లేక పాలు, బ్రెడ్, కూరగాయలు వంటి నిత్యావసర వస్తువులు కూడా కొనుక్కోలేక పోతున్నామని రాజేశ్ షా అనే సీనియర్ సిటిజన్ పేర్కొన్నారు. ‘పాత నోట్లను మార్చుకోవడానికి మేము రెండు రోజులు క్యూలో నిలబడ్డాము. మా బ్యాంకు ఖాతాలో రూ.3లక్షలు ఉన్నాయి. కాని, నిత్యావసర వస్తువులు కూడా కొనుక్కోలేక పోతున్నాము. (ప్రధాని) మోదీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించడానికి ముందు తగిన ఏర్పాట్లు చేసి ఉండవలసింది’ అని షా అన్నారు. బనస్కంత జిల్లా శిహోరి, కచ్ జిల్లా అబ్‌డస తదితరచోట్ల పాత నోట్లకు బదులు కొత్త నోట్లు ఇవ్వడానికి నిరాకరించిన బ్యాంకు అధికారులతో ప్రజలు గొడవకు దిగారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేయవలసి వచ్చింది.
నగదు లేని ఎటిఎంలు
దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ప్రజల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. వారాంతపు దినమైన శనివారం సాయంత్రం విహారానికి బయల్దేరి చేతి ఖర్చులకోసం ఎటిఎం కేంద్రాలకు వెళ్లగా, నగదు లేక అవి బోసిపోయి కనిపించి ఉన్నాయి. చాలాచోట్ల నగదు లేక పోవడం వల్ల ఎటిఎంలను మూసివేశారు. కొన్నిచోట్ల ఎటిఎంలు పనిచేయడం లేదు. లాల్‌బాగ్, వర్లి, కుర్లా, మహీం, పరేల్, దాదర్ సహా దక్షిణ ముంబయిలోని అనేక ప్రాంతాల్లో ఎటిఎంలు పనిచేయడం లేదని ప్రజలు పేర్కొన్నారు. ముంబయి శివారు ప్రాంతమైన అంధేరి, ఘట్కోపర్, విఖ్రోలి, బోరివలి వంటి ప్రాంతాల్లోనూ ఎటిఎంలు పనిచేయడం లేదని స్థానికులు చెప్పారు. పెద్ద నోట్ల రద్దు ఉద్యోగుల పాలిట శాపంగా మారింది. ఉద్యోగులు సాధారణంగా ప్రతి నెల మొదటి వారంలో బ్యాంకులు, ఎటిఎంల నుంచి నగదు తీసుకుంటారు. ఇప్పుడు ఎటిఎంలు పనిచేయకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రద్దు నిర్ణయం ప్రకటించక ముందు తీసుకున్నవారు కూడా అవి రూ.500, 1000 నోట్లు కావడంతో వాటిని మార్చుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. అక్కడక్కడ పనిచేస్తున్న ఎటిఎంల వద్ద ఎండను సైతం లెక్క చేయకుండా భారీగా క్యూలైన్లు ఉంటున్నాయి.
ఢిల్లీలో తొక్కిసలాట వదంతులు
రద్దు చేసిన పాత నోట్లను మార్చుకోవడానికి ఢిల్లీలోని వివిధ బ్యాంకుల వద్దకు శనివారం కూడా ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. చాందినీ చౌక్‌లోని ఒక ఎటిఎం వద్ద తొక్కిసలాట జరిగి నలుగురు గాయపడ్డారని సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అయింది. అయితే దానిని పోలీసులు ఖండించారు. చాందినీ చౌక్‌లోని ఏ బ్యాంకు వద్ద కాని, ఎటిఎం వద్ద కాని తొక్కిసలాట జరగలేదని వివరించారు. వదంతులు నమ్మవద్దని ప్రజలను కోరారు. వదంతులు వ్యాప్తి చేసే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

న్యూఢిల్లీలోని పహాడ్‌గంజ్ ప్రాంతంలో శనివారంనాడు ఒక బ్యాంక్ వద్ద బారులు తీరిన జనం. గంటలకొద్దీ క్యూలో నిలబడి అలసిపోయ దిగాలుగా కూర్చున్న ఓ మహిళ (ఇన్‌సెట్)