జాతీయ వార్తలు

127వ జయంతి సందర్భంగా నెహ్రూకి ఘన నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 14: భారతదేశ తొలి ప్రధాన మంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ 127వ జయంతి సందర్భంగా సోమవారం ఆయనకు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా యావత్ ప్రజలంతా ఘనంగా నివాళులర్పించారు. శాంతివనంలోని నెహ్రూ సమాధి వద్ద రాష్టప్రతితోపాటు ఉప రాష్టప్రతి హమీద్ అన్సారీ శ్రద్ధాంజలి ఘటించగా, పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లోని నెహ్రూ చిత్ర పటానికి లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌తో పాటు పలువురు పార్లమెంటేరియన్లు పుష్పాంజలి ఘటించారు. నెహ్రూ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నానని మోదీ ‘ట్విట్టర్’లో పేర్కొన్నారు. శాంతివనం వద్ద నెహ్రూకు అంజలి ఘటించిన ప్రముఖుల్లో మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ప్రభృతులు ఉన్నారు. ఈ సందర్భంగా అక్కడ చిన్నారులు దేశభక్తి గీతాలను ఆలపించగా, నాయకులు మువ్వనె్నల బెలూన్లను గాలిలోకి వదిలారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో లోక్‌సభ స్పీకర్‌తోపాటు కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు, అనంత్ కుమార్, ముక్తార్ అబ్బాస్ నక్వీ తదితర ప్రముఖులు నెహ్రూ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. రాజ్యసభ ఉపాధ్యక్షుడు పిజె.కురియన్, ప్రతిపక్ష నాయకుడు గులామ్ నబీ ఆజాద్, మాజీ ఉప ప్రధాన మంత్రి, ఎథిక్స్ కమిటీ చైర్‌పర్సన్ ఎల్‌కె.అద్వానీ, పలువురు ఎంపీలు, మాజీ పార్లమెంటేరియన్లతోపాటు లోక్‌సభ సెక్రటరీ జనరల్ అనూప్ మిశ్రా, రాజ్యసభ సెక్రటరీ జనరల్ షంషేర్ కె.షరీఫ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పండిట్ నెహ్రూ జీవిత విశేషాలతో కూడిన పుస్తకాన్ని హిందీ, ఆంగ్ల భాషల్లో విడుదలచేసి అతిథులకు అందజేశారు.