జాతీయ వార్తలు

పెళ్లింట్లో నోట్లకు పాట్లు! భారంగా మారిన నిర్వహణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 14: భారత్‌లో పెళ్లిళ్ల హడావుడి అంతా ఇంతా కాదు. వివాహాల నిర్వహణ అనేది వారి సామాజిక హోదాకు చిహ్నంగా మారిన రోజులివి. సామాన్య ప్రజలు కూడా అట్టహాసంగా పెళ్లిళ్లు జరిపిస్తుంటారు. అయితే పెద్ద నోట్ల రద్దు వల్ల మార్కెట్‌లో కరెన్సీ కొరత ఏర్పడటంతో ఇప్పుడు వివాహాల నిర్వహణ తీవ్ర సమస్యగా మారింది. ‘టెంట్ వాళ్లకు, బంగారం కొనుగోలుకు ముందు డబ్బులు ఇవ్వాలా? ప్రతి రోజు సాయంత్రం నన్ను ఇదే సమస్య వెంటాడుతోంది. రూ.500, 1000 నోట్ల రద్దుతో చెల్లించడానికి తన వద్ద తగినంత డబ్బు లేదు. పెళ్లి చేయడం ఎలా అనే బాధ వెంటాడుతోంది. శుభకార్యం జరుపుకుంటున్నామన్న సంతోషం లేకుండా పోయింది’ ఈ నెల 24న కుమార్తెకు వివాహం చేయతలపెట్టిన రాజీందర్ గుప్తా అనే ఢిల్లీవాసి ఆవేదన ఇది. ప్రభుత్వ చర్య మంచిదే అయినా, సరయిన ప్రణాళిక లేకుండా ముందుకు సాగడంతో పాటు పెద్ద నోట్ల రద్దుకు ఇది తగిన సమయం కూడా కాదని గుప్తా అన్నారు. ‘ఇంట్లో పెళ్లి పెట్టుకున్న వ్యక్తి నగదుకోసం వెళ్లి గంటల తరబడి క్యూలో ఎలా నిలబడగలరు? అదీ రూ. పది వేలు లేదా అంతకన్నా తక్కువ కోసం. అవి ఏ ఒక్క పనికీ సరిపోవు’ అని ఆయన భారంగా నిట్టూర్చారు. ఇది ఒక్క రాజీందర్ గుప్తా సమస్యే కాదు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో అనేక మంది తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సీజన్‌లో వ్యాపారులకు మంచి వ్యాపారం జరుగుతుంది. అయితే మార్కెట్‌లో చలామణికి నగదు కొరత ఏర్పడటంతో వారు తీవ్రంగా నష్టపోతున్నారు. వివిధ పెళ్లిళ్లలో బ్యాండు బృందాలకు రూ.5వేల నుంచి రూ.51వేల వరకు అవుతుంది. నెల రోజుల్లోగా పూర్తి చెల్లింపులు చేయాలి. అయితే బ్యాండు మేళం వారికి ముందస్తుగా కొంత చెల్లింపు (అడ్వాన్స్) చేయడానికి కూడా డబ్బులు లేక పెళ్లిళ్లు చేసేవారు తీవ్రంగా సతమతం అవుతున్నారు.
‘నేను కస్టమర్ల ఇబ్బందులను అర్థం చేసుకోగలను. కాని, నేను నా వద్ద పనిచేసే వర్కర్లకు వేతనాలు ఇవ్వాలి. పెద్ద నోట్ల రద్దు వల్ల మా వ్యాపారం కూడా దెబ్బతింటోంది’ అని ఠాగూర్ గార్డెన్‌లోని సింధి హీరానంద్ బ్యాండ్ యజమాని పంకజ్ వాపోయారు. పంకజ్ వలె ఎంతోమంది బ్యాండ్ యజమానులు, ఇతర చిన్న వ్యాపారులు నోట్ల రద్దుతో గిరాకీ కోల్పోయి చితికిపోతున్నారు.